వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ ఓకే కానీ, మాదే: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జయ మేనల్లుడు

ఇప్పటికే అన్నాడీఎంకేను శశికళ తన చేతుల్లోకి తీసుకోవడాన్ని మొదటి నుంచి ప్రశ్నిస్తున్న జయలలిత కోడలు దీపా జయకుమార్‌కు ఆమె సోదరుడు దీపక్ జయకుమార్ తోడైనట్లుగా కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇప్పటికే అన్నాడీఎంకేను శశికళ తన చేతుల్లోకి తీసుకోవడాన్ని మొదటి నుంచి ప్రశ్నిస్తున్న జయలలిత కోడలు దీపా జయకుమార్‌కు ఆమె సోదరుడు దీపక్ జయకుమార్ తోడైనట్లుగా కనిపిస్తోంది.

పోయెస్ గార్డెన్ పైన శశికళకు హక్కు లేదని చెబుతూ.. పార్టీని ఆమె నడుపవచ్చునని, కానీ ఆమె కుటుంబ సభ్యులకు హక్కులేదని చెబుతున్నారు.

తాజాగా గురువారం నాడు శశికళకు దీపక్ షాకిచ్చారు. అసలు పోయెస్ గార్డెన్ తమకు చెందిందని అని తెలిపారు. జయలలిత మృతి తర్వాత పోయెస్ గార్డెన్‌లో శశికళ కుటుంబ సభ్యులు ఉంటున్నారు.

'రిసార్టులో ఏంజరిగిందో ఆధారాలు': శశికళకు షాక్, పళని ప్రభుత్వం నిలబడేనా?'రిసార్టులో ఏంజరిగిందో ఆధారాలు': శశికళకు షాక్, పళని ప్రభుత్వం నిలబడేనా?

పన్నీరు సెల్వం సీఎంగా ఉన్నప్పుడు.. శశికళకు దక్కకుండా దానిని స్మారక కేంద్రంగా చేయాలని భావించారు. ఆ దిశగా అడుగులు వేశారు. అయితే, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అది కుదరలేదు.

శశికళ జైలుకెళ్లడం, ఆమె వర్గం నేత పళనిస్వామి సీఎం కావడం తెలిసిందే. దీంతో పోయెస్ గార్డెన్ అంశం పక్కకు పోయింది. ఇప్పుడు జయలలిత అల్లుడు దీపక్ జయకుమార్ పోయెస్ గార్డెన్ పైన తొలిసారి స్పందించారు.

సైలెన్స్ బ్రేక్

సైలెన్స్ బ్రేక్

పోయెస్ గార్డెన్ అంశంపై దీపక్ జయకుమార్ తొలిసారి స్పందించారు. ఇతను తొలుత శశికళ వైపు మాట్లాడారు. కానీ ఆ తర్వాత భిన్నరాగం వినిపిస్తున్నారు. పోయెస్ గార్డెన్ తనకు, తన సోదరి దీపకు చెందుతుందని దీపక్ అన్నారు. ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు.

ట్విస్ట్.. శశికళ వర్సెస్ జయ ఫ్యామిలీ

ట్విస్ట్.. శశికళ వర్సెస్ జయ ఫ్యామిలీ

శశికళ బంధువులు టీటీవీ దినకరన్, వెంకటేష్‌లకు అన్నాడీఎంకే పార్టీని నడిపే హక్కు లేదని దీపక్ వ్యాఖ్యానించారు. నిన్నటి దాకా దీప.. శశికళ పైన మాటల దాడి చేశారు. పన్నీరు సెల్వంతో కలిశారు. ఇప్పుడు దీపక్ కూడా జయలలిత వారసత్వం కోసం పోరాడుతున్నారు. దీంతో ఇఫ్పుడు శశికళ వర్సెస్ జయలలిత ఫ్యామిలీగా మారింది.

ఎవరికీ హక్కు లేదు... అత్త ఆస్తులు మావే

ఎవరికీ హక్కు లేదు... అత్త ఆస్తులు మావే

జయలలిత పైన సుప్రీం కోర్టు విధించిన జరిమానాను చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు. అయితే తనకు ఎలాంటి రాజకీయ ఆశలు లేవని చెప్పారు. తాను ఆస్తులు అమ్మి జరిమానా కడతానని చెప్పారు. కానీ పోయెస్ గార్డెన్ మాత్రం తన సోదరి దీపది, తనది మాత్రమే అన్నారు. పోయెస్ మాది అని ఇతరులకు ఎవరికీ చెప్పే హక్కు లేదన్నారు. మా అత్త ఆస్తులకు మేమే హక్కుదారులం అన్నారు.

ట్విస్ట్ ఇచ్చిన దీపక్

ట్విస్ట్ ఇచ్చిన దీపక్

తనకు రాజకీయాల పైన ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. శశికళను పార్టీ అధినేత్రిగా తాను అంగీకరిస్తానని చెప్పారు. కానీ టీవీవీ దినకరన్‌ను, వెంకటేష్‌లను మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పారు. అవసరమైతే తన సోదరి దీప కావొచ్చునని, వారిద్దరికి మాత్రం హక్కు లేదన్నారు.

జయ మృతి తర్వాత..

జయ మృతి తర్వాత..

జయలలిత మృతి తర్వాత ఆమె కోడలు దీపా జయకుమార్ తెరపైకి వచ్చారు. శశికళ పైన విమర్శలు గుప్పించారు. కానీ దీపక్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే పార్టీ అధినేత్రిగా శశికళకు మద్దతు ఇచ్చారు. కానీ పోయెస్ గార్డెన్ విషయంలో, శశికళ తన కుటుంబ సభ్యులకు పార్టీని అప్పగించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

పార్టీలో చీలిక వస్తుందని హెచ్చరిక

పార్టీలో చీలిక వస్తుందని హెచ్చరిక

శశికళ బలవంతంగా పార్టీని తమ వారి చేతిలోకి తీసుకుంటోందని దీపక్ ఆరోపించారు. పార్టీ క్యాడర్ దానిని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని చెప్పారు. ఇలాగే అయితే పార్టీలో చీలిక వస్తుందని హెచ్చరించారు. ఇలాగైతే ప్రతిపక్ష స్టాలిన్ అధికారంలోకి వస్తారన్నారు. శశికళ ఇలాంటి నిర్ణయాలు (ఫ్యామిలీ చేతుల్లో పార్టీ పెట్టడం) ఎందుకు తీసుకున్నారో అన్నారు.

పన్నీరు గురించి... అంతకుమించి చెప్పదల్చుకోలేదు

పన్నీరు గురించి... అంతకుమించి చెప్పదల్చుకోలేదు

పన్నీరు సెల్వం గురించి కూడా దీపక్ మాట్లాడారు. పన్నీరు బాగా పాలించారని కితాబిచ్చారు. తాను పన్నీరును గౌరవిస్తానని అన్నారు. అతను మంచి ముఖ్యమంత్రి అన్నారు. అంతకుమించి ఆయన గురించి చెప్పదలుచుకోలేదని తెలిపారు.

ఫ్రెష్ ట్విస్ట్..

ఫ్రెష్ ట్విస్ట్..

శశికళ పైన దీపా జయకుమార్ పోరాడుతుంటే.. దీపక్ జయకుమార్ మాత్రం ఆమె వైపు ఉన్నారు. మౌనంగా ఉన్నప్పటికీ.. శశికళ వైపు నిలిచారు. అంతేకాదు, రిసార్టులో ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నారు. అయితే, ఇప్పుడు శశికళను అంగీకరిస్తానని. అయితే పోయెస్ గార్డెన్ తమదేనని, అలాగే శశికళ ఫ్యామిలీని అంగీకరించనని దీపక్ చెప్పడంతో తమిళ రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది.

English summary
Breaking his silence for the first time, Jayalalithaa's nephew Deepak Jayakumar said that Poes Garden belonged to him and his sister Deepa.Deepak Jayakumar, in an interview to television channel NewsX said that Sasikala's relatives TTV Dinakaran and Venkatesh cannot run the AIADMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X