పోలవరం: బీజేపీ విప్, కాంగ్రెస్ తటస్థం, తెరాసకు తోడు..

Polavaram bill to Lok Sabha today
న్యూఢిల్లీ: ఐదో రోజు పార్లమెంటు సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఇవాల లోకసభలో పోలవరం బిల్లుపై చర్చ, ఓటింగ్ జరగనుంది. లోకసభకు ట్రాయ్ సవరణ బిల్లు కూడా రానుంది.

బీజేపీ, టీడీపీ విప్

ఆంధ్రప్రదేశ్‌కు సాగునీరు, తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. పోలవరం బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదముద్ర వేయించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం బిల్లు నేడు లోకసభలో చర్చకు రానుంది.

దీంతో బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. పోలవరం బిల్లుకు మద్దతు పలకాలని ఆదేశించింది. మరోవైపు బిల్లుకు మద్దతు తెలిపేలా టీడీపీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. పోలవరం బిల్లు పైన కాంగ్రెసు పార్టీ తటస్థ వైఖరి అవలంభించనుంది.

ఏకమైన మూడు రాష్ట్రాల ఎంపీలు

పోలవరం పైన మూడు రాష్ట్రాల ఎంపీలు ఏకమయ్యారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెట్టిన ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2014ను అడ్డుకునేందుకు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఎంపీలుసిద్ధమయ్యారు. ఇందుకోసం మూడు రాష్ట్రాల ఎంపీలు సమావేశమై వ్యూహాలను రచించారు.

వెంకయ్యదే భారం!

అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లు నేడు లోకసభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కలిశారు. పోలవరం బిల్లును త్వరితగతిన ఆమోదించి, పనులు ఆరంభించేలా చూడాలని కోరారు. దీంతో పాటు, బూర్గంపాడు రెవెన్యూ మండలాన్ని కూడా బిల్లులో కలపాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+