సినిమా ప్రభావం: బాలికను చంపి, శవాన్ని కూలర్‌లో దాచాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

చండీగఢ్‌: సినిమా ప్రభావంతో 16 ఏళ్ల టీనేజ్ బాలుడు ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి ఆ తర్వాత చంపేశాడు. శవాన్ని వాటర్ కూలర్‌లో దాచాడు. బాలికను నీటి తొట్టెలో ముంచి చంపాడు.

ఈ దారుణ సంఘటన హర్యాన చోటుచేసుకుంది. తన బావ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూతురిని బుధవారం చాక్లెట్ల ఆశ చూపి నిందితుడు ఇంట్లోకి ఆహ్వానించినట్లు అంబాలా ఎస్పీ అభిషేక్‌ జోర్వాల్‌ మీడియాకు తెలిపారు.

Police arrest teen for allegedly killing 5-year-old girl

ఈ సమయం లో నిందితుడి బావ, కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారన్నారు. ఆ తర్వాత బాలికను నిందితుడు ఇంట్లో నిర్బంధించాడు. తమ కూతురు కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈలోగా నిందితుడు వారికి ఫోన్‌ చేసి రూ.20 లక్షలు డిమాండ్‌ చేశాడని అభిషేక్‌ చెప్పారు. దీంతో తాము ఆ కాల్‌ను ట్రేస్‌ చేశామని చె్పారు. కిడ్నాప్‌ వ్యవహారం పోలీసులకు తెలిసిందని భావించిన నిందితుడు చిన్నారిని నీటి తొట్టెలో ముంచి హత్యచేశాడు.

చంపిన తర్వాత చిన్నారి మృతదేహాన్ని వాటర్‌ కూలర్‌లో దాచాడు. ఆ ఇంటిపై అర్ధరాత్రి ఒంటిగంట గంట సమయంలో దాడిచేసి నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను చేసిన తప్పునకు అతను ఎంతమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, ఓ సినిమాలో చూపినట్లు ఈజీ మనీ కోసమే చిన్నారిని కిడ్నాప్‌ చేశానని అంగీకరించాడని ఆయన చెప్పారు. నిందితుడి బావ చనిపోయిన హతురలి తండ్రి దుకాణంలోనే పనిచేస్తున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The 16-year-old boy hid the body in a water cooler after drowning the minor in a tub, said Ambala superintendent of police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X