రిసార్ట్స్‌లో సెక్స్ రాకెట్ : రేవ్ పార్టీలో 82 మంది
రాజస్థాన్: రేవ్ పార్టీ నిర్వహిస్తున్న హోటల్, రిసార్ట్స్ మీద రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ సేవించి, మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తూ ఊగిపోతున్న అందరిని అరెస్టు చేశారు. 16 మంది యువతులు, ఇద్దరు మహిళలతో సహ 82 మందిని అరెస్టు చేశారు. పెద్ద సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది.
ఈ రేవ్ పార్టీకి ఒక సంవత్సరం పాపను తీసుకు వచ్చి నిద్రపుచ్చారని, పాప తల్లి సెక్స్ రాకెట్ లో ఉందని ఉదయ్ పూర్ సిటి పోలీస్ కమిషనర్ అజయ్ పాల్ లంబా అన్నారు. రాజస్థాన్ లో ఇంత పెద్ద సెక్స్ రాకెట్ ను ఇంత వరకు తాను చూడలేదని ఆయన అన్నారు. డీఎస్పీ రను శర్మ ఆద్వర్యంలో 25 మంది పోలీసు సిబ్బంది హోటల్, రిసార్ట్స్ మీద దాడులు చేసి అరెస్టు చేశారని అజయ్ పాల్ లంబా వివరించారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ శివార్లలోని ఉదయ్ పూర్- అహమ్మదాబాద్ హై వే రోడ్డులో ఉదయ్ ప్యాలెస్ హోటల్ అండ్ రిసార్ట్స్ ఉంది. ఈ హోటల్ యజమాని పవన్ బన్సాల్. ఆదివారం రాత్రి ఈ హోటల్ లో రేవ్ పార్టి నిర్వహించారు. ఢిల్లీ, ముంబాయి, ఆగ్రా,బోపాల్ తదితర ప్రాంతాల నుండి అమ్మాయిలను రప్పించారు.
రేవ్ పార్టీకి హాజరు అయ్యే ఒక్కోక్కరి దగ్గర రూ. 6,000 నుండి రూ. 4,000 వరకు (ఎంట్రీ ఫీజ్) వసూలు చేశారు. విషయం తెలుసుకున్న ఇద్దరు పోలీసులు మఫ్టీలో వెళ్లి రూ. 12,000 చెల్లించి రేవ్ పార్టిలో హాజరైనారు. మందు, డ్రగ్స్ సరఫరా అయ్యింది. మద్యం మత్తులో అర్దనగ్నంగా డ్యాన్స్ లు వేశారు.

నచ్చిన అమ్మాయితో బేరం కుదుర్చుకుని రూంలలోకి తీసుకు వెళ్లడం మొదలు పెట్టారు. ఈ విధంగా పెద్ద సెక్స్ రాకెట్ నిర్వహించారు. సోమవారం వేకువ జామున మూడు గంటల సమయంలో అందరూ పీకలదాక మద్యం సేవించి రెచ్చిపోతున్నారు.
ఇద్దరు పోలీసులు పై అధికారులకు సమాచారం అందించారు. వేకువ జామున 4.30 గంటల సమయంలో పోలీసులు హోటల్, రిసార్ట్స్ మీద దాడులు చేసి అందరిని అరెస్టు చేశారు.
హోటల్ యజమాని పవన్ బన్సాల్ ఇతర రాష్ట్రాల నుండి యువతులను రప్పించి రేవ్ పార్టీలు, సెక్స్ రాకెట్ లునిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అందరిని అరెస్టు చేసి వారి మీద పిటాచట్టం కింద కేసులు నమోదు చేశామని ఉదయ్ పూర్ జిల్లా ఎస్పీ అజయ్ పాల్ లంబా వివరించారు. అరెస్టు అయిన వారిలో గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్తలు చాల మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications