భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఏటీఎస్... పేలుళ్లు,ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసిన అల్‌ఖైదా
ఉత్తరప్రదేశ్‌లో విధ్వంసానికి ప్లాన్ చేసిన అల్‌ఖైదా ఉగ్ర కుట్రను యాంటీ టెరర్రిజం స్క్వాడ్ భగ్నం చేసింది. మిన్హజ్ అహ్మద్,మసీరుద్దీన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. యూపీ రాజధాని లక్నో సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో బాంబు దాడులతో పాటు ఆత్మాహుతి దాడులకు అల్‌ఖైదా ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ గుర్తించింది. స్వాతంత్ర్య దినోత్స వేడుకలకు ముందు ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు తేల్చింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌తో పాటు పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌లోని కెట్టా నుంచి ఈ ఆపరేషన్ జరుగుతున్నట్లు నిర్దారించింది.
ఉగ్ర కుట్రపై సమాచారం అందడంతో ఉత్తరప్రదేశ్‌లోని పలుచోట్ల ఏటీఎస్ ఆదివారం(జులై 11) దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా లక్నోలోని కకోరి పట్టణంలో మిన్హజ్ అహ్మద్ అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేసింది. అతని నుంచి పేలుడు పదార్థాలతో పాటు తుపాకీని స్వాధీనం చేసుకుంది.

మరో ఏటీఎస్ టీమ్ జౌన్‌పూర్ జిల్లాలోని మరియహు పట్టణంలో మసీరుద్దీన్ అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేసింది. అతని నుంచి భారీ ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. అలాగే ఓ ప్రెజర్ కుక్కర్‌ను స్వాధీనం చేసుకుంది. మిన్హజ్ అహ్మద్,మసీరుద్దీన్... ఈ ఇద్దరూ అల్‌ఖైదాకు చెందిన అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఆదేశాల మేరకు పేలుళ్లకు కుట్ర చేసినట్లు గుర్తించింది. వీరి వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు.
Recommended Video
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లో చారిత్రక కట్టడాలు,బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు అల్‌ఖైదా ప్లాన్ చేసింది. ఇందులో మిన్హజ్ అహ్మద్,మసీరుద్దీన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. లక్నో,కాన్పూర్‌లలోనూ అల్‌ఖైదా మనుషులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మసీరుద్దీన్ తండ్రి ఇంట్లోనూ ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అగస్టు 15 సమీపిస్తుందంటే చాలు దేశంలో విధ్వంసానికి ఉగ్ర మూకలు రంగంలోకి దిగుతుంటారు. గతంలోనూ స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో ఉగ్ర కుట్రలను పోలీసులు భగ్నం చేశారు.












Click it and Unblock the Notifications