కానిస్టేబుల్ మనసు దోచుకొన్న మహిళ దొంగ, వాలంటైన్స్ డే రోజున ఇలా...
ఓ మహిళ దొంగను ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు జైలులో పనిచేసే కానిస్టేబుల్.అయితే ఈ వివాహనికి కానిస్టేబుల్ మొదటి భార్య కూడ అంగీకరించింది.వాలంటైన్స్ డే రోజునే కానిస్టేబుల్ ఆమెను పెళ్ళిచేసుకొన్నాడు.
పాట్నా:ఓ మహిళ దొంగ, వస్తువులను దోచుకోవడమే కాదు. పోలీసుల మనసును కూడ దోచుకొంది. దొంగతనం కేసులో శిక్షను అనుభవిస్తూ జైలు కొచ్చిన మహిళ దొంగ పోలీసు మనసును దోచుకొంది. చివరకు వీరిద్దరూ వాలంటైన్స్ డే రోజున వివాహం చేసుకొన్నారు. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
మహమ్మద్ ఇనాముల్ (52) కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర నుండి బీహర్ లోని కతిహార్ జైలులో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు.సరిఫుల్ ఖతున్ (25) అనే యువతి చోరి, కిడ్నాప్ కేసులో గత ఏడాది కతిహార్ పోలీసులు అరెస్టు చేశారు.
ఎనిమిది మాసాల పాటు ఆమె జైలు శిక్ష అనుభవించింది.గతంలోనే మహమ్మద్ ఇనాముల్ కు వివాహమైంది. అయినా ఆయన సరిపుల్ ఖతున్ పై మనసు పడ్డాడు. ఆమె కూడ ఇనామునల్ ను ప్రేమించింది.

తన ప్రేమను ఏనాడు కూడ ఆమె వ్యక్తం చేయలేదు. చివరగా జైలు శిక్ష పూర్తి చేసుకొని ఆమె విడుదలైంది. ఈ నెల 14వ, తేదిన తన మనసులోని మాటలను సరిపుల్ కు గులాబీ ఇచ్చి చెప్పాడు మహమ్మద్ ఇనాముల్.
ఇనాముల్ కు సరిపుల్ కూడ ఓకే చెప్పింది. దీంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేమకు వయస్సు అడ్డంకి కాదని ప్రేమికులకు వయసు కేవలం ఒక అంకెలా కన్పిస్తోందని ఆమె చెప్పారు.
ప్రతి మహిళ ఇనాముల్ లాంటి భర్తే కావాలని కోరుకొంటుందని ఆమె అభిప్రాయపడింది. వాలంటైన్స్ డే రోజున సరిపుల్ తల్లిదండ్రులు, సోరుడి సమక్షంలో ఈ వివాహం జరిగింది. రెండో పెళ్ళికి మొదటి భార్యకూడ ఎలాంటి అడ్డు చెప్పలేదని ఆమె కూడ ఇష్టపూర్వకంగానే ఈ వివాహం జరిగిందని ఇనాముల్ చెప్పారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications