చిన్నమ్మకు మరో షాక్: శశికళపై కిడ్నాప్ కేసు, ఎమ్మెల్యే ఫిర్యాదు
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పైన కిడ్నాప్ కేసు నమోదయింది. ఆమెతో పాటు అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా చిన్నమ్మ ఎంపిక చేసిన పళని స్వామి పైన కూడా కేసు నమోదయింది.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పైన కిడ్నాప్ కేసు నమోదయింది. ఆమెతో పాటు అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా చిన్నమ్మ ఎంపిక చేసిన పళని స్వామి పైన కూడా కేసు నమోదయింది.
తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారని దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డెన్ బే రిసార్టు నుంచి చివరి నిమిషంలో పారిపోయి వచ్చానని ఆయన చెప్పారు. ఆయన ఫిర్యాదుతో కువత్తూరు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

మద్దతు ఇవ్వకపోతే చంపుతామని శశికళ బెదిరించారని ఆ తరవాత శరవనణ్ ఆరోపించారు. ఆయన డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. మద్దతు ఇవ్వకుంటే చంపుతామని అంటున్నారని, రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కాగా, శరవణన్ మొదట శశికళ వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారు.












Click it and Unblock the Notifications