సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు నమోదు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్‌పై ఢిల్లీ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 26ఏళ్ల బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు మాధవన్‌పై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2018లో తన భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాలకు హోర్డింగ్​లు పెట్టేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడని చెప్పారు. తన భర్త 2020 ఫిబ్రవరిలో చనిపోయాడని.. తర్వాత తన ఆర్థిక పరిస్థితి దిగజారిందని తెలిపారు.

 Police Files Rape Case Against Sonia Gandhis Personal Secretary

ఈ నేపథ్యంలోనే సహాయం కోసం కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లినట్లు బాధితురాలు చెప్పారు. సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి మాధవన్‌ని కలిసినట్లు వివరించారు. 'ఆ తర్వాత పీపీ మాధవన్ నాతో చాలా సార్లు మాట్లాడాడు. నా ఆర్థిక పరిస్థితి గురించి నేను అతడికి వివరించాను. నాకు జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నాం. 2022 జనవరి 21న జాబ్ ఇంటర్వ్యూ గురించి నాకు మెసేజ్ పంపించాడు. సురేంద్రనగర్‌​లోని ఓ ఇంటికి వెళ్లాలని సూచించాడు' అని తన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొన్నారు. అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, జూన్ 25న ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశాం. మేము ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాము' అని ద్వారకా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ తెలిపారు.

71 ఏళ్ల మాధవన్ బాధితురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ అనుమతి లేకుండా శారీరక సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+