రౌడీషీటర్ ఇంటిలో రూ. 50 కోట్ల పాతనోట్లు సీజ్! బ్లాక్ అండ్ వైట్!
బెంగళూరు: అక్రమంగా మారణాయుధాలు పెట్టుకుని పాతపెద్ద నోట్లు (రూ.1,000, రూ.500)ను కొత్తనోట్లుగా మార్చుతున్నారని సమాచారం రావడంతో బెంగళూరు మాజీ కార్పొరేటర్ వి. నాగరాజ్ అలియాస్ రౌడీషీటర్ బాంబు నాగ ఇంటిపై బెంగళూరు నగర సిటీ పోలీసులు దాడి చేశారు. బాంబు నాగ ఇంటిలో మారణాయుధాలతో సహ రూ. 50 కోట్ల పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపురలో రౌడీషీటర్ బాంబు నాగ కార్యాలయం ఉంది. ఆ కార్యాయలంపై శుక్రవారం బెంగళూరు పోలీసులు దాడి చేశారు. కార్యాలయంలో మూడు వేటకోడవళ్లు, రెండు డ్రాగర్లు స్వాధీనం చేసుకున్నారు.

బాంబు నాగ కార్యాలయంలో మూటల్లో కట్టిన పెట్టి పాత రూ. 1,000, రూ. 500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 100 కోట్ల పాతనోట్లు ఉన్నాయని పోలీసులకు ముందుగానే సమాచారం అందింది.
నకిలి తాళం ఉపయోగించిన పోలీసులు పక్కింటి వారి సహకారంతో బాంబు నాగ కార్యాలయంలో ప్రవేశించారు. బాంబు నాగ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న పాత నోట్లను పోలీసులు లెక్కిస్తున్నారు. ఈ సందర్బంగా పోలీసులు గట్టింబదోబస్తూ ఏర్పాటు చేశారు.

తరువాత అదే ప్రాంతంలో నాలుగు అంతస్తుల కట్టడంలో నివాసం ఉంటున్న బాంబు నాగ ఇంటి మీద పోలీసు అధికారులు దాడి చేశారు. బాంబు నాగ అక్కడి నుంచి తప్పించుకోకుండా ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసిన బాంబు నాగ ఆయన అనుచరులు అతని కుటుంబ సభ్యుల దగ్గర రూ. 50 లక్షలు వసూలు చేసుకుని వదిలిపెట్టారని పోలీసులు అంటున్నారు. అంతే కాకుండ బాంబు నాగ మీద అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. బాంబు నాగ ఇంటిలో సోదాలు చెయ్యకుండా స్థానిక మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నింయడంతో పోలీసులు అదనపు బలగానుల రంగంలోకి దింపారు.












Click it and Unblock the Notifications