టిప్పుసుల్తాన్ జయంతి, దేశ్రద్రోహికి పూజలు చేస్తారా, కర్ణాటకలో బీజేపీ ఆందోళ, నిషేదాజ్ఞలు !

Posted By:
Subscribe to Oneindia Telugu
  Tipu Sultan Jayanti: Section 144 imposed | Oneindia Telugu

  బెంగళూరు: టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించరాదని బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామసేన, భజరంగ్ దళ్ తదితర హిందూ సంఘ, సంస్థలు వ్యతిరికిస్తున్న సందర్బంలోనే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం అయ్యింది.

  అనేక వివాదాల మధ్య రాష్ట్రంలోని అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు ప్రాంతాల్లో టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించరాదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర హిందూ సంఘ సంస్థలు ఆందోళనకు దిగాయి.

  Police has arrests BJP MLA and Hindu activists for protest against Tipu Jayanti in Karnataka

  టిప్పుసుల్తాన్ ఒక దేశ ద్రోహి, హిందూవులు, క్రైస్తవులను ఊచకోత కోశాడని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టిప్పుసుల్తాన్ దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారితో పోరాటం చేశాడని, అందుకే ఆయన జయంతి వేడుకలు నిర్విహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

  టిప్పుసుల్తాన్ జయంతిని వ్యతికిస్తూ మడికేరిలో శుక్రవారం ధర్నా జరిగింది. ఆ సందర్బంలో అటువైపు వెళ్లిన కేఎస్ ఆర్ టీసీ బస్సుల మీద రాళ్ల వర్షం కురిపించారు. టిప్పుసుల్తాన్ జయంతిని వ్యతిరేకిస్తూ శుక్రవారం మడికేరి సంపూర్ణ బంద్ కు పిలుపునిచ్చారు. అల్లర్లు ఎక్కువ కావడంతో బీజేపీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ తో పాటు ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

  Police has arrests BJP MLA and Hindu activists for protest against Tipu Jayanti in Karnataka

  మడికేరిలో ప్రైవేట్ బస్సులు, వాహన సంచారం పూర్తిగా నిలిచిపోయింది. మడికేరిలో సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. మడికేరి, దక్షిణ కన్నడ జిల్లా, భద్రావతి, మైసూరు, బెంగళూరులోని పలు ప్రాంతాలు, బళ్లారి, శివమొగ్గ, మంగళూరు, చికమగళూరు తదితర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Karnataka Congress government would celebrate the birth anniversary of 18th century ruler Tipu Sultan for the third year on Friday, November 10, 2017. Tipu Jayanti.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి