Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిట్టింగ్ ఎంపీ హత్యకు స్కెచ్, ఎన్ఐఏకి చిక్కకుండా ఏం చేశాడంటే? ఒక్క ఫోన్ కాల్ దెబ్బకు!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిట్టింగ్ ఎంపీ హత్యకు ప్లాన్ చేసి చాలా కాలం నుంచి ఎన్ఐఏ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న నిందితుడిని ఐటీ హబ్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులోని టౌన్ హాల్ సమీపంలో సీఏఏకు మద్దతుగా ప్రసంగించిన నేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారి అజహర్ నాలుగేళ్ల తర్వాత అరెస్ట్‌ అయ్యాడు.

నిందితుడు అజహర్ ను బెంగళూరులోని కళాసిపాళ్య పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అజహర్ గత నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. 2019లో సీఏఏ ( CAA) కి సంబంధించి బెంగళూరు టౌన్ హాల్ దగ్గర ఒక కార్యక్రమం జరిగింది. బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్విసూర్య, చక్రవర్తి సూలిబెలే సీఏఏకు అనుకూలంగా అదే కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ అనే వ్యక్తిపై దాడి జరిగింది.

Police have arrested the accused who planned to kill Bengaluru South BJP MP Tejaswi Surya and escaped

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, చక్రవర్తి సూలిబెలేతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు నాయకులను హతమార్చడానికి ప్లాన్ చేసిన నిందితులు పొరపాటున వరుణ్ అనే వ్యక్తి మీద దాడికి పాల్పడ్డారు. ఘటన అనంతరం 6 మంది నిందితులను బెంగళూరులోని కలాసిపాళ్య పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కళాసిపాళ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కుట్రకు ప్రధాన సూత్రదారి అజహర్ అని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

గత నాలుగేళ్లుగా ఆ కేసులో అజహర్ ఎస్కేప్ అయ్యాడు. ప్రధాన నిందితుడిగా ఉన్న అజహర్ తరువాత పక్కాప్లాన్ తో సౌదీకి పారిపోయాడు. భార్య సోదరులు సౌదీలో ఉండడంతో అక్కడికి అజహర్ పారిపోయి కేసు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. ఐదు నెలలు సౌదీ అరేబియాలో తలదాచుకున్న అజహర్ తరువాత అక్కడి నుంచి భార్య నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిపోయి బెంగళూరు రాకుండా జాగ్రత్తపడ్డాడు.

సౌదీ నుంచి వచ్చిన తర్వాత కోలారు జిల్లాలోని బంగారుపేటలోని భార్య ఇంట్లోనే అజహర్ నివాసం ఉంటున్నాడు. గత నాలుగేళ్లుగా భార్య ఇంట్లో ఉంటున్న అజహర్ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్నాడు. ఎన్ఐఏ అధికారులు కూడా అజహర్ కోసం చాలా ప్రాంతాల్లో సోదాలు చేసి అతన్ని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. బంగారుపేటలోని భార్య ఇంట్లో ఉన్న అజహర్‌ను బెంగళూరులోని కళాసిపాళ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Police have arrested the accused who planned to kill Bengaluru South BJP MP Tejaswi Surya and escaped

ఆసక్తికర విషయం ఏమిటంటే అజహర్ ఓ నంబర్ కు ఫోన్ చేసి కార్ల వ్యాపారం గురించి మాట్లాడాడు. అజహర్ మాట్లాడిన ఫోన్ నెంబర్ ను అతను డిలీట్ చెయ్యడం మరిచిపోయాడు. అదే ఫోన్ నెంబర్ బెంగళూరులోని కలసిపాళ్య పోలీసులకు చిక్కింది. ఆ ఫోన్ నెంబర్ కాల్‌ డేటా వివరాలు సేకరించిన కళాసిపాళ్య పోలీసులు పూర్తి సమాచారం బయటకులాగేశారు. తరువాత నాలుగు సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అజహర్ బంగారుపేటలో కుర్చుని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో కార్ల వ్యాపారం చేస్తున్నాడని వెలుగులోకి వచ్చింది.

నిందితుడు అజహర్ ఫొటో చేతిలో పట్టుకుని బంగారుపేట వెళ్లిన పోలీసులు చివరికి అతని భార్య ఇంటికి వెళ్లి అతన్ని అరెస్టు చేశారు.నిందితుడు అజహర్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. బెంగళూరు టౌన్ హాల్ దగ్గర వరుణ్‌పై జరిగిన దాడి కేసులో అజహర్ ప్రధాన సూత్రధారి. దాడి ఘటన అనంతరం ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అజహర్ సౌదీకి పారిపోయాడు. ఎస్‌డీపీఐ సంస్థలో నిందితుడు అజహర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+