షాక్: పోలీస్ భార్యపై అత్యాచారం, బెయిల్‌ కోసం రూ. 5 లక్షలు

ముంబై: సస్పెండైన పోలీసు అధికారి జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే శిక్షను అనుభవిస్తున్న పోలీసు అధికారి స్నేహితుడే నమ్మించి పోలీస్ అధికారి భార్యపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకొంది.

మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట అత్యాచారాలు, దాడులు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. చిన్నారుల నుండి వివాహితల వరకు ప్రతి రోజూ ఏదో రకంగా లైంగిక వేధింపులకు గురౌతున్నారు.

భర్త స్నేహితుడని నమ్మింనందుకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. భర్తను జైలు నుండి విడిపిస్తానని నమ్మించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు.ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇన్స్‌పెక్టర్ భార్యపై రేప్

ఇన్స్‌పెక్టర్ భార్యపై రేప్

మహరాష్ట్రలోని ముంబై‌ కళ్యాణ్ ప్రాంతంలో ఓ కేసులో పోలీసు ఇన్స‌పెక్టర్ సస్పెండయ్యారు. ప్రస్తతం అతను జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే జైలులో శిక్షను అనుభవిస్తున్న సమయంలోనే అతడిని విడిపించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే జైలులో శిక్షను అనుభవిస్తున్న భర్తను విడిపించేందుకుగాను భర్త స్నేహితుడు షిండే నమ్మించాడు. అంతేకాదు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బెయిల్ కోసం రూ. 5 లక్షలు

బెయిల్ కోసం రూ. 5 లక్షలు

ఓ కేసులో శిక్షను అనుభవిస్తున్న పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఏడాదిగా జైలులో ఉంటున్నాడు.అయితే అతడిని బయటకు రప్పించేందుకు ఇన్స్‌పెక్టర్ స్నేహితుడు షిండే ఇన్స్‌పెక్టర్ భార్య వద్ద రూ. 5 లక్షలు తీసుకొన్నాడు. అంతేకాదు ఈ డబ్బును ఇవ్వలేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇన్ప్‌పెక్టర్ భార్యపై అత్యాచారం చేశాడు.

షిండేపై పిర్యాదు

షిండేపై పిర్యాదు

జైలు నుండి పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఏడాది తర్వాత విడుదలయ్యాడు. అతను జైలు నుండి విడుదలయ్యాక షిండే తనపై అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని బాధితురాలు భర్తకు తెలిపింది. దీంతో ఆయన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తు

పోలీసుల దర్యాప్తు

పోలీసు ఇన్స్‌పెక్టర్ భార్యపై షిండే అత్యాచారానికి పాల్పడడం సంచలనం కల్గించింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. అంతేకాదు షిండే బాధితురాలి వద్ద నుండి రూ. 5 లక్షలను తీసుకొన్న విషయమై కూడ విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+