వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపారు... మంగళూరు కాల్పుల్లో చనిపోయిన బాధితుడి కూతురు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు , చెలరేగుతుండడంతో పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే దేశవ్యప్తంగా 20కి మందికి పైగా పౌరులు ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కర్ణాటకలోని మంగళూరులో సైతం పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో మంగళూరులో ఇద్దరు మృతి చెందారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యురప్ప రెండురోజుల పాటు మంగళూరులోనే మకాం వేసి సమీక్ష జరిపిన పరిస్థితి నెలకోంది.

పౌరనిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలు

పౌరనిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలు

అయితే ఘర్షణల్లో భాగంగా పలువురు అమాయాక ప్రజలు కూడ తమ ప్రాణాలు కోల్పోయారు. నిరసల గురించి తెలియని వారు రోడ్లపైకి రావడంతో వారిపై కూడ పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో మంగళూరులో ఇదే పరిస్థితి నెలకోంది. ఈ నేపథ్యంలోనే అల్లర్లతో సంబంధం లేని తన తండ్రిని తన కళ్లముందే కాల్పులు జరిపారని మంగళూరు కాల్పుల్లో చనిపోయిన జలీల్ కూతురు చెబుతోంది.

శుక్రవారం మంగళూరులో కాల్పులు

శుక్రవారం మంగళూరులో కాల్పులు

శుక్రవారంనాడు జలీల్ అనే మంగళూరులోని బందరు నివాసి జలీల్ రోజు కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా జలీల్ కు ఇద్దరు మైనర్ పిల్లలు భార్య ఉన్నారు. కాగా కాల్పులు జరిపిన రోజు తన తండ్రీ జలీల్ నిరసనల్లో పాల్గోనకున్నా కాల్పుల్లో చనిపోయారని ఆరోపించారు. ఈనేపథ్యంలోనే మంగళూరులోని ఆందోళననేపథ్యంలోనే స్కూలునుండి ఇంటివద్ద వదిలిపెట్టాల్సిన వ్యాన్ మధ్యలోనే డ్రాప్ కావడంతో పిల్లలని తీసుకువస్తుండగా ఇంటికి కొంచెం దూరంలోనే కాల్పులు జరిగాయని దీంతో ఆయన ఎడమ కంటికి బుల్లెట్ తగిలిందని తెలిపారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్స్ అప్పటికే చనిపోయారని చెప్పారని తెలిపారు.

పోలీసుల తప్పుడు ప్రచారం

పోలీసుల తప్పుడు ప్రచారం

దీంతో జాతియ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జలిల్ కూతురు పోలీసుల చర్యపై తీవ్రంగా ఆరోపణలు చేసింది. పోలీసులు కళ్లముందే తన తండ్రిని కాల్చారని చెప్పింది. కాగా కాల్పులు జరిపిన సమయంలో పోలీసులు చెబుతున్నట్టుగా ఏడు నుండి తొమ్మిది వేల మంది నిరసనకారులు రోడ్డుపై లేరని కేవలం యాబై నుండి వందమంది మాత్రమే ఉన్నారని జలీల్ కుటుంబసభ్యుల్లో ఒకరు చెప్పారు. కాల్పులు జరిపిన రోజు అక్రిడేషన్ లేకుండా భాదిత కుటుంబాలను ఇంటర్యూ చేశారనే ఆరోపణలతో ఎనిమిది మంది కెరళకు చెందిన మీడియా బృందాన్ని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
police killed my father infront of me, says daughter of Mangaluru man killed in CAA protest on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X