చలో అసెంబ్లీ: ఆంక్షలతో ఎపిఎన్జీవోలకు అనుమతి

హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాదంతో రేపు బుధవారం ఎపి ఎన్జీవోలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఎపి ఎన్జీవోలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. సేవ్ ఆంధ్రప్రదేస్ నినాదంతో రేపు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయనున్నారు. సాయంత్రం 4 గంటల లోపు సభ ముగించాలని, అసెంబ్లీ వైపు దూసుకురావద్దని పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇందిరా పార్కు వద్దనే ధర్నా చేయాలని పోలీసులు సూచించారు.

కాగా, ఛలో హైదరాబాద్ కార్యక్రమం బుధవారం నిర్వహిస్తామని, ఇందుకు అనుమతి కోసం పోలీస్ అధికారులను కలిసామని మంగళవారం సాయంత్రానికి అనుమతి రావచ్చునని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అంతకు ముందు అన్నారు. రేపు ధర్నా ప్రశాంతంగా నిర్వహిస్తామని పోలీసులకు చెప్పామని, గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనల వల్ల వచ్చిన సమస్యలతో పోలీసులు అనుమానం పడడం సహజమేనని, తాము ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పామని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.

Police permits APNGO's dharna in Hyderabad

ఇప్పటికే సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు బయలుదేరారని అశోక్‌బాబు తెలిపారు. ఒక వేళ ధర్నాకు అనుమతి రాకపోతే ఏం చేయాలన్నదానిపై ఈ రాత్రి ఉద్యోగులతో కలిసి చర్చించి నిర్ణయిస్తామని ఆయన అన్నారు. వేదిక మీదకు ఎవరు రావాలనుకున్నా పార్టీలకతీతంగా జెండాలను పక్కన పెట్టి రావచ్చునని అశోక్‌బాబు చెప్పారు. వచ్చిన వారంతా సమైక్యం కోసమే రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తాము నిర్వహిస్తుంది ధర్నా మాత్రమేనని, ఛలో అసెంబ్లీ నిర్వహించడం లేదని అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఎందుకంటే బిల్లుపై సభలో చర్చ జరుగుతోందని, ఇప్పుడు అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తే సభలో ఉన్న ఎమ్మెల్యేల దృష్టి ఇటువైపే ఉంటుందని, అంచేత ధర్నా మాత్రమే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదని అశోక్‌బాబు హామీ ఇస్తున్నామని చెప్పారు. సభకు అనుమతి ఇవ్వకుంటే ప్రభుత్వమే సమైక్యవాదాన్ని దెబ్బతీసినట్లుఅవుతుందని ఆయన అన్నారు.

త్వరలో బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని కలుస్తామని, రాష్ట్ర విభజనకు మద్దతు ఇవ్వొద్దని కోరతామని అశోక్‌బాబు చెప్పారు. పార్లమెంట్‌కు తెలగాణ బిల్లు వస్తే సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు సమైక్యవాదం వినిపించాలని అశోక్‌బాబు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+