సంఘ విద్రోహ శక్తులు మెరీనా బీచ్ లో ఇలా చేశారు, వదిలేదు లేదు

జల్లికట్టు ఆందోళనలో విధ్వంసానికి అసాంఘిక శక్తులే పాల్పడ్డాయని, అలాంటి విద్రోహ శక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులే తప్పు చేస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నై నగర పోలీసు

చెన్నై: జల్లికట్టు ఆందోళనలో విధ్వంసానికి అసాంఘిక శక్తులే పాల్పడ్డాయని చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జీ విలేకరులతో అన్నారు. అలాంటి అసాంఘిక శక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

పోలీసులే ఉద్రిక్తతలను ప్రేరేపించి, విధ్వంసానికి దిగినట్లు సామాజిక మీడియాలో వస్తోందని మీడియా ప్రశ్నించగా పోలీసులే తప్పు చేస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జి స్పష్టం చేశారు.

పన్నీర్ సెల్వంకు ఇలా చెక్ పెట్టారు: పక్కా ప్లాన్ తో సీఎం పోస్టు ఔట్ !

ఆందోళకారుల విధ్వంసం, పోలీసుల ప్రతిచర్యలతో చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిద జిల్లాలు అట్టుడికిపోయాయి. తమిళనాడులో నిరసనకారులు, పోలీసుల మధ్య యుద్ద వాతావరణం చోటుచేసుకుంది.

Police says in Chennai yesterdays violence 140 vehicles damaged

ఇలాంటి సమయంలో ఆందోళనకారులు సహనం పాటించాలని పోలీసులు మనవి చేశారు. అయితే మమ్మల్ని కావాలనే రెచ్చగొట్టారని, అందుకే ఇలా జరిగిందని ఆందోళనకారులు అంటున్నారు.

ఇదే చాన్స్: తమిళనాడు సీఎంగా చిన్నమ్మ శశికళ, డేట్ ఫిక్స్ చేశారు !

చెన్నై నగరంలో మొత్తం 140 వాహనాలు బూడిద అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. తాము మాత్రం ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ కు నిప్పంటించలేదని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు.

అంతకు ముందు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంతో తమిళనాడు డీజీపీతో సమావేశం అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా సంఘ విద్రోహ శక్తులను ఆందోళనలో ప్రవేశ పెట్టారా ? అనే కోణంలో పూర్తి వివరాలు సేకరించాలని పన్నీర్ సెల్వం పోలీసులకు సూచించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+