Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pakistan:మగువ మత్తులో DRDO సైంటిస్ట్ - అన్నీ చూపించింది- ఏం చేశాడంటే..?

పూణే: పాకిస్తాన్ పన్నిన వలలో భారత్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త చిక్కుకున్నాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే... డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్‌కర్ చిక్కుల్లో పడ్డాడు. ఓ మగువ విసిరిన వలలో పడి డిఫెన్స్‌కు చెందిన రహస్యాలు వెల్లడించాడు.

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ జారా దాస్ గుప్తా (అసలు పేరు ఇది కాదు) అనే అమ్మాయి డీఆర్‌డీఓ సైంటిస్ట్ ప్రదీప్ కురుల్‌కర్‌కు అందంతో వలవేసింది. ఆమె వాట్సాప్ ద్వారా తనను తాను పరిచయం చేసుకుని క్రమంగా ప్రదీప్ కురుల్‌కర్‌తో చాటింగ్ ప్రారంభించింది. తన అందంతో ప్రదీప్‌ను మైమరిపించి మెల్లగా భారత క్షిపణి వ్యవస్థకు సంబంధించిన రహస్యాలు, ఇతర డిఫెన్స్ ప్రాజెక్టుల సమాచారం లాగింది.

Police Uncover DRDO Scientists connection to Pakistani spy agent and missile secrets

పూణేలోని ఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)ల్యాబ్‌కు డైరెక్టర్‌గా ప్రదీప్ కురుల్‌కర్ వ్యవహరిస్తున్నారు. డిఫెన్స్‌కు సంబంధించిన రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్నారని, గూఢచర్యం చేస్తున్నాడన్న అనుమానంతో యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ అధికారిక రహస్యాలు చట్టం కింద మే 3వ తేదీన ప్రదీప్‌ను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ప్రదీప్ కురుల్‌కర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఏటీఎస్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం ప్రదీప్ కురుల్‌కర్ పాక్ మగువ జారాదాస్ గుప్తాతో వాట్సాప్‌ కాల్స్‌, వీడియో కాల్స్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ముందుగా జారాదాస్ గుప్తా యూకేలో తానొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకుంది. కొంతకాలం పాటు ప్రదీప్‌ను నమ్మించింది. ఆ తర్వాత ప్రదీప్‌కు తన అందంతో వల వేసింది. కొన్న అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లతో ప్రదీప్‌ను ఆకట్టుకుందని చార్జ్‌షీట్ పేర్కొంది. అయితే విచారణ చేసే సమయంలో ఆ ఐపీ అడ్రస్‌ పాకిస్తాన్‌లో ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు.

బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిసైల్ లాంచర్, మిలటరీ బ్రిడ్జింగ్ వ్యవస్థ గురించి జారాదాస్ గుప్తా ప్రదీప్ కురుల్‌కర్‌ నుంచి కూపీ లాగినట్లు ఏటీఎస్ తన చార్జ్‌షీట్‌లో నమోదు చేసింది. కురుల్‌కర్ మగువ మైకంలో పడి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన డీఆర్‌డీఓ సమాచారంను తన ఫోన్‌లోకి వేసుకుని ఆ ఫోన్ నుంచి జారాకు షేర్‌ చేసినట్లు విచారణాధికారులు గుర్తించారు. పలు ప్రాజెక్టుల గురించి ప్రదీప్ జారాతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ప్రదీప్ కురుల్‌కర్ మరియు జారాదాస్‌ గుప్తాలో టచ్‌లో ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది.

తాను జారాకు సమాచారం పంపుతున్నట్లు గుర్తించిన డీఆర్‌డీఓ ఎప్పుడైతే అంతర్గత విచారణ ఆదేశించిందో అప్పుడే అంటే ఫిబ్రవరి 2023లో జారా నెంబర్‌ను బ్లాక్ చేశారు ప్రదీప్. ఆ వెంటనే మరొక ఇండియన్ నెంబర్ నుంచి నెంబర్‌ను ఎందుకు బ్లాక్ చేశావంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తన షెడ్యూల్, లొకేషన్లు ఎక్కడా ఎవరితో పంచుకోకూడదని తెలిసి కూడా జారాతో షేర్ చేసినట్లు చార్జ్‌షీట్‌లో ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+