బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన ప్రశాంత్ కిశోర్: మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల భారతీయ జనతా పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో అంచనా వేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఇంచుమించు గతసారి ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద కానీ, బీజేపీ మీద కానీ దేశంలో పెద్దగా కోపం లేదన్నారు. అంతేగాక, బీజేపీకి సవాల్ విసిరే వ్యక్తులు గానీ లేరన్నారు. బీజేపీని మోడీ మరోసారి విజయతీరాలకు చేరుస్తారని చెప్పుకొచ్చారు.
2019లో బీజేపీకి 303 సీట్లు వచ్చినట్లే ఈసారీ అటూఇటుగా, లేదా కాస్త ఎక్కువే వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కొన్ని హామీలు నెరవేర్చని కారణంగా నరేంద్ర మోడీపై ప్రజలకు కొంత నిరాశ ఉండొచ్చు కానీ.. కోపంగా అయితే లేరని తెలిపారు. ఈసారి కూడా బీజేపీకి 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

మరోవైపు, రాహుల్ గాంధీ వస్తే పరిస్థితి ఇంకొంత మెరుగవుతుందన్న భావన ఆయన మద్దతుదారుల నుంచి మాత్రమే కనిపిస్తోందన్న ప్రశాంత్ కిశోర్.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదన్నారు. 325 లోక్‌సభ స్థానాలు ఉండే ఉత్తర, పశ్చిమ భారతం 2014 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉందని వ్యాఖ్యానించారు. 225 నియోజకవర్గాలు ఉన్న తూర్పు, దక్షిణ భారతంలో బీజేపీకి ప్రస్తుతం 50 కంటే తక్కువ సీట్లున్నాయని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
అయితే ఈసారి దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీకి నష్టం అంటూ వస్తే అది ఉత్తర, పశ్చిమ భారత్‌లోనే జరుగుతుందని అంచనా వేశారు. ఇక, బీజేపీ ఓడిపోతుందా లేదా విజయం సాధిస్తుందా అన్న చర్చ ఎక్కడా లేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీ 370 సీట్లు సాధిస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైందన్నారు. చర్చ కేంద్రకాన్ని చార్ సౌ పార్ నినాదంతో మోడీ మార్చివేశారని.. ఇందుకు మోడీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని అన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications