Power bill: సిక్స్ లు కొట్టిన సిద్దూ ఈ రోజు కరెంట్ బిల్లును సిక్స్ కొట్టాడు. రూ, 8 లక్షలు బాకి, సీఎం సార్ !

అమృత్ సర్/ పంజాబ్: సొంత పార్టీలోని నాయకుల దెబ్బతో సతమతం అవుతున్న ముఖ్యమంత్రికి ప్రతిపక్షలు విమర్శలు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు శిరోమణి అకాలి దళ్ నాయకులు షాక్ ఇచ్చారు. అయ్యా సీఎం గారు మీ పార్టీ రెబల్ నాయకుడు, ఆలనాటి క్రికెట్ దిగ్గజ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్దూ రూ. 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు కట్టకుండా చోద్యం చూస్తున్నారని, ఆయన దగ్గర విద్యుత్ బిల్లు కంటించడానికి ఏమైనా మీకు టైమ్ ఉందా ? లేదా బిజీగా ఉన్నారా ? అంటూ చురకలు అంటించారు. కరోనా కాలంలో సామాన్య ప్రజలను కరెంట్ బిల్లులు కట్టాలని వేధించడం కాదు, ముందు మీ వాళ్లతో కరెంట్ బిల్లు కట్టించండి అంటూ సూచించారు.

 సొంత పార్టీలో సిద్దూ రెబల్ లీడర్

సొంత పార్టీలో సిద్దూ రెబల్ లీడర్


భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నవజ్యోత్ సింగ్ రెబల్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే స్టేట్ మెంట్ లు ఇస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇటీవల పంజాబ్ ప్రజలకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని అమరీందర్ సింగ్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.

సిక్స్ లు కొట్టిన సిద్దూ కరెంట్ బిల్లుకు సిక్స్ కొట్టేశాడు

సిక్స్ లు కొట్టిన సిద్దూ కరెంట్ బిల్లుకు సిక్స్ కొట్టేశాడు

పంజాబ్ లోని అమృత్ సర్ లోని సొంత ఇంటికి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇంత వరకు రూ. 8, 67, 540 విద్యుత్ బిల్లు చెల్లించుకుండా చోద్యం చూస్తున్నారని శిరోమణి అకాలిదళ్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. నవజ్యోత్ సింగ్ కరెంట్ బిల్లు బాకీ ఉన్నారని ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నా ఆయన్ను మీరేందుకు ప్రశ్నించలేదు ? అంటూ సీఎం అమరీందర్ సింగ్ ను శిరోమణి అకాలిదళ్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
క్రికెట్ ఆడే సమయంలో బాల్ పడితే సిక్స్ కొట్టిన సిద్దూ ఈ రోజు కరెంట్ బిల్లును సిక్స్ కొట్టేసి తనకు ఏమీ పట్టనట్లు ఉన్నారని ఎద్దేవ చేస్తున్నారు.

 కరెంట్ కట్

కరెంట్ కట్

పంజాబ్ లో సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు విద్యుత్ సరఫరా కట్ చేసి సమస్య పరిష్కరించడానికి అక్కడి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చర్యలు తీసుకుంటున్నారని, అలా కాకుండా ఇంతవరకు సొంత పార్టీ నాయకులు (కాంగ్రెస్) కట్టవలసిన కరెంట్ బిల్లులు కూడా వసూలు చేస్తే బాగుంటుందని శిరోమణి అకాలిదళ్ పార్టీ నాయకులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూ సూచిస్తున్నారు.

ఉచిత విద్యుత్ హామీ

ఉచిత విద్యుత్ హామీ

పంజాబ్ లో ప్రస్తుతం విద్యుత్ సరఫరా విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ కార్యాలయాల సమయం కుదించిన పంజాబ్ ప్రభుత్వం ఆ కార్యాలయాల్లో ఏసీలు బంద్ చేయించింది. తాము పంజాబ్ లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ ల ఉచిత్ విద్యుత్ ఇస్తామని ఇప్పటికే అమ్ ఆద్మీ పార్టీ నాయకులు పంజాబ్ ప్రజలకు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+