ఈవీఎం బ‌ట‌న్ ఎలా నొక్కాల‌ని అడిగిన ఓట‌ర్‌: నొక్కి చూపించిన ఏజెంట్‌

చండీగ‌ఢ్: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయ‌డానికి వినియోగించే ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌పై బ‌ట‌న్ల‌ను ఎలా నొక్కాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డ్డారు కొంద‌రు ఓట‌ర్లు. దీన్ని సాకుగా తీసుకుని వారి ఓట్ల‌ను కూడా తానే వేసేశాడో ప్ర‌బుద్ధుడు. అత‌ను ఓ జాతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్‌. త‌మ ఓటును తాము వేసుకోలేక‌పోయామ‌ని, స‌ద‌రు ఏజెంట్ వేశాడంటూ ఓ మ‌హిళా ఓట‌రు ఫిర్యాదు చేయ‌డం, దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వెలుగులోకి రావ‌డంతో అత‌ని బండారం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఆ పోలింగ్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేశారు.

ఆరో విడ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆదివారం హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఫ‌రీదాబాద్ ప‌రిధిలోని అసౌటీ పోలింగ్ కేంద్రానికి ఓటు వేయ‌డానికి వ‌చ్చారు ముగ్గురు మ‌హిళ‌లు. వారికి ఈవీఎంల‌పై ఉన్న బ‌ట‌న్ల‌ను ఎలా నొక్కాలో తెలియ‌లేదు. ఏ బ‌ట‌న్ నొక్కితే ఏ అభ్య‌ర్థికి ఓటు ప‌డుతుందోనే అనుమానంతో పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న ఓ జాతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్‌ను స‌హాయం అడిగారు. దీన్ని సాకుగా తీసుకున్న ఆ పోలింగ్ ఏజెంట్‌.. ఈవీఎంల‌పై బ‌ట్ల‌ను ఎలా నొక్కాలో వివ‌రిస్తూ, వారి ఓట్ల‌ను తానే వేసేశాడు.

Poll agent arrested for trying to influence voters inside Faridabad booth

దీన్ని గ‌మ‌నించిన పోలింగ్ సిబ్బంది ఒక‌రు ఈ త‌తంగాన్నంత‌టినీ త‌న సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి హ‌ర్యానా ఎన్నిక‌ల అధికారుల దృష్టిలో ప‌డింది. వెంట‌నే దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు అధికారులు. ఈ ఘ‌ట‌న‌పై ఓ నివేదిక అందించాల‌ని అసౌటీ పోలింగ్ కేంద్రం సూక్ష్మ ప‌రిశీల‌కుడికి సూచించారు. ఎన్నిక‌ల సిబ్బంది, మహిళా ఓట‌ర్ ఫిర్యాదు మేర‌కు అధికారులు ఆ పోలింగ్ ఏజెంట్‌ను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+