Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీలో మూడో దశ పోలింగ్ ప్రారంభం - ఆ రెండు పార్టీలకూ కీలకం : అఖిలేష్ కు పరీక్ష..!!

ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో..ఇప్పుడు అందరి ఫోకస్ యూపీ పైనే ఉంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తి కావటంతో..మరో అయిదు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో కీలకమైన మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. బుందేల్‌ఖండ్, అవధ్, పశ్చిమ యూపీల్లోని 16 జిల్లాల పరిధిలో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. అన్ని పార్టీల నుంచి 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 96 మంది మహిళలు. 2.15 కోట్ల ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరింటి దాకా పోలింగ్‌ జరగనుంది.

Recommended Video

    Punjab Elections 2022 | Up Elections 3rd Phase | Polling Update
    రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా

    రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా

    హత్రాస్, ఫిరోజాబాద్, ఇటావా, కాస్‌గంజ్, మెయిన్‌పురి, ఫరూకాబాద్, కనౌజ్, ఇటావా, ఔరైయా, కాన్పూర్‌ దేహత్, కాన్పూర్‌ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబా జిల్లాల్లో పోలింగ్‌ జరగనుంది. తొలి రెండు విడతల పోలింగ్ పైన బీజేపీ..ఎస్పీ నేతలు ధీమాగా ఉన్నారు.

    రెండు విడతల్లోనూ తమకు వంద సీట్లు వస్తాయని సీఎం యోగీ చెబుతుంటే..తాము వంద సీట్లు దాటుతున్నామని ఎస్పీ అధినేత అఖిలేష్ ధీమా వ్యక్తం చేసారు. ఇక, మూడో విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో యాదవ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండటంతో...ఎస్పీ ఈ దశ పోలింగ్ పైన ఆశలు పెంచుకుంది.

    పట్టు సాధించేదిశగా ఎస్పీ

    పట్టు సాధించేదిశగా ఎస్పీ

    2017లో ఈ ప్రాంతంలో ఎస్పీ పట్టు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లు గెలుచుకుంది. 2012 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలిచిన ఎస్పీ ఈసారి ఆ తరహా ఫలితాలు ఖాయమని నమ్ముతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, ఆయన శివపాల్‌ సింగ్‌ యాదవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఈ దశలో బరిలో ఉన్నారు. బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్‌ జరుగుతున్న 5 జిల్లాల్లోని 13 అసెంబ్లీ స్థానాలను 2017లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అక్కడ పట్టు కొనసాగించేందుకు బీజేపీ అగ్ర నేతలు ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ పెట్టారు. సుడిగాలి పర్యటన చేసారు.

    బీజేపీ ఇక్కడ ఎస్పీని దెబ్బ కొడితేనే

    బీజేపీ ఇక్కడ ఎస్పీని దెబ్బ కొడితేనే

    జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా ప్రముఖులు 31 బహిరంగ సభలు, రోడ్‌ షోలు నిర్వహించారు. యోగి ఐదు జిల్లాల్లో కేవలం 28 గంటల్లో 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హల్‌ స్థానం కూడా ఇందులో ఉంది. అఖిలేశ్‌ యాదవ్ సహా ఎస్పీ సింగ్‌ భాగెల్, శివపాల్‌ సింగ్‌ యాదవ్, రాంవీర్‌ ఉపాధ్యాయ, లౌసీ ఖుర్షీద్‌ లు సైతం పోటీ చేస్తున్న నియోజకవర్గాలు మూడో దశలో ఉన్నాయి.

    యోగీ కేటినెట్ లో మంత్రులుగా ఉన్న అసీం అరుణ్, సతీశ్‌ మహానా, రాం నరేశ్‌ అగ్నిహోత్రి, మనోహర్‌లాల్‌ మన్ను కోరి, లఖన్‌సింగ్‌ రాజ్‌పుత్, నీలిమా కటియార్, అజిత్‌ సింగ్‌ పాల్‌ వారి స్థానాలు సైతం ఈ విడతలోనే ఉండటంతో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

    ఈ విడత బీజేపీ - ఎస్పీ హోరా హోరీ

    ఈ విడత బీజేపీ - ఎస్పీ హోరా హోరీ

    ఇక, యూపీ మూడో విడతలో గెలుపుపై అధికార భాజపా కూడా ధీమాగానే ఉంది. గత అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపైనే భాజపా ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభ.. శాంతి భద్రతలను అదుపు చేయడం, అయోధ్య, కాశీ క్షేత్రాల అభివృద్ధి వంటి పరిణామాలు కలిసి వస్తాయని.. కమలదళం అంచనా వేస్తోంది. ఎస్పీ మాత్రం బీజేపీ పైన వ్యతిరేకత..యోగీ పాలనలో చోటు చేసుకున్న పరిణామాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది. దీంతో..ప్రస్తుతం జరుగుతున్న మూడో విడత ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+