Polls: తమిళనాడులో పుంజుకున్న బీజేపీ, ఒకే ఒక్క ఓటు, భార్య, తల్లిదండ్రులు కూడా ఓటు వెయ్యలేదు !
చెన్నై: తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ సత్తాచాటుకోవడానికి ప్రయత్నించాయి. ఇదే సమయంలో ఊహించని విదంగా బీజేపీ పుంజుకుంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకంటే ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. గతంలో కంటే అధిక సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ మంచి ఊపుమీద ఉంది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్ సభ, శాసనసభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ నాయకులు ఇక ముందు తమిళనాడులో జరిగే అన్ని ఎన్నికల్లో ఎవరితో పోత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని అంటున్నారు. స్థానిక స్థంసల ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి ఒకేఒక్క ఓటు రావడం హాట్ టాపిక్ అయ్యింది. భార్య, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల్లో ఒక్కరు కూడా ఒక్క ఓటే అతనికి వెయ్యకపోవడంతో అతను బిత్తరపోయాడు. నా భార్యతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ తనను మోసం చేశారని ఆ అభ్యర్థి లబోదిబో అంటున్నాడు. ఎవరు ఓటు వేసినా వెయ్యకపోయినా నా ఓటు నాకు పడింది అని అతను చెప్పాడని స్థానిక మీడియా తెలిపింది.
activist:
భజరంగ్
దళ్
కార్యకర్త
హత్య,
మాజీ
సీఎం
సంచలన
వ్యాఖ్యలు,
రూ
10
లక్షలకు
డీల్
!

సత్తా చాటుకున్న బీజేపీ
తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేతో పాటు అన్నాడీఎంకే పార్టీకి దీటుగా బీజేపీ సత్తా చాటుకోవడానికి ప్రయత్నించింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటే ఇప్పుడు బీజేపీ పుంజుకుంది. 2011లో కంటే ఇప్పుడు అధిక సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచి ఊపుమీద ఉన్నారు.

చెన్నై కార్పోరేషన్ లో బోణి
చెన్నైలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో ఒక వార్డులో బీజేపీ విజయం సాధించింది. చెన్నై కార్పోరేషన్ 134వ వార్డు నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉమా ఆనందన్ కార్పోరేటర్ గా విజయం సాధంచారు. చెన్నై కార్పోరేషన్ ఎన్నికల్లో గతంలో కంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది.

ఒకే ఒక్క ఓటు....... మైండ్ బ్లాక్
ఈరోడ్ లోని భవానీసాగర్ పట్టణ పంచాయితీ 11వ వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నరేంద్రన్ కు ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. స్థానిక స్థంసల ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నరేంద్రన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోడ్ లో పోటీ చేసిన నరేంద్రన్ వ్యక్తికి ఒకే ఒక్క ఓటు రావడం హాట్ టాపిక్ అయ్యింది.

భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ కూడా ఓటు వెయ్యలేదు
భార్య, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల్లో ఒక్కరు కూడా ఒక్క ఓటే అతనికి వెయ్యకపోవడంతో అతను బిత్తరపోయాడు. నా భార్యతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ తనను మోసం చేశారని బీజేపీ లీడర్ నరేంద్రన్ లబోదిబో అంటున్నాడు. ఎవరు ఓటు వేసినా వెయ్యకపోయినా నా ఓటు నాకు పడింది అని నరేంద్రన్ చెప్పాడని స్థానిక మీడియా తెలిపింది. ఎవరు నన్ను ఆధరించినా, ఆదరించకపోయినా వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి పోటీ చేస్తానని నరేంద్రన్ అంటున్నాడు.

సత్తాచాటుకున్న బీజేపీ
తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ సత్తాచాటుకోవడానికి ప్రయత్నించాయి. ఇదే సమయంలో ఊహించని విదంగా బీజేపీ పుంజుకుంది. గతంలో 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకంటే ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. గతంలో కంటే అధిక సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ మంచి ఊపుమీద ఉంది.

ఒంటరిపోరాటం
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్ సభ, శాసనసభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. గతంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ నాయకులు ఇక ముందు తమిళనాడులో జరిగే అన్ని ఎన్నికల్లో ఎవరితో పోత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని అంటున్నారు. తమళనాడులో బీజేపీ 22 కార్పోరేషన్ వార్డుల్లో, 56 మునిసిపాలిటీల్లో. 230 పట్టణ పంచాయితీల్లో, 195 టౌన్ పంచాయితీల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం మీద గతంలో కంటే తమిళనాడులో బీజేపీకి ఓటు బ్యాంకు కూడా పెరిగింది ఆ పార్టీ నాయకులు అంటున్నారు.