అశ్లీల చిత్రాలు పంపితే ఇక అంతే .. మీ నంబర్ బ్లాక్ అవుతుంది
న్యూఢిల్లీ : ఇతరులను వేధించేందుకు అశ్లీల చిత్రాలను పంపుతున్నారా ? నేరపూరిత వీడియోలను వాట్సాప్, ఇతర సోషల్ సైట్ల ద్వారా షేర్ చేస్తున్నారా ? జాగ్రత్త. ఇకపై అలా చేస్తే మీ ఫోన్ నంబర్ పర్మనెంట్ గా బ్లక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక అది ఎప్పటికీ యాక్టివేట్ కాకపోవచ్చు.

ఇక ఉపేక్షించం ..
మనం సిమ్ కార్డు తీసుకునే సమయంలో అగ్రిమెంట్ చేసేప్పుడు అశ్లీల ఫొటోలు పంపితే చర్యలు తీసుకుంటామని స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే దీనిపై ఇన్నాళ్లు కేంద్ర టెలికం శాఖ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక అలాంటి వారిని ఉపేక్షించబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు మంగళవారం టెలికాం ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీచేసింది.

ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయండి
అశ్లీల ఫొటోలు, వీడియోలపై మొబైల్ వివినియోగదారులు ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించాలని స్పష్టంచేసింది. వినియోగదారుడు చేసే ఫిర్యాదుపై 15 రోజుల్లోగా స్పందించాలని తేల్చిచెప్పింది. ఆయా ఫొటోలు, వీడియోలు పంపిన వినియోగదారుడి నంబర్ ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.

డీఎన్డీ మాదిరిగా చర్యలు
డూ నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ)లో రిజిస్టర్ అవ్వకుండా వ్యాపార ప్రకటనలు చేసే వారి నంబర్లను ఇప్పటికే డీవోటీ బ్లాక్ చేస్తోంది. ఆ విధంగా బ్లాక్ అయిన నంబర్లు ఎప్పటికీ తిరిగి యాక్టివేట్ కావు. అశ్లీల వీడియోలు, ఫొటోల విషయంలో ఈ తరహా చర్యలు తప్పనిసరి అని డీవోటీ అధికారి తేల్చిచెప్పారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications