బృందావనంలో విషాదం: భవన బాల్కనీ కూలి పడటంతో ఐదుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాంకే బిహారీ ఆలయం సమీపంలో ఓ పురాతన భవనం బాల్కనీ కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కాగా, బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం వీధులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక్కడ దుకాణాలు ఎక్కువగా ఉండటంతో భక్తులు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటారు. మంగళవారం ఈ ప్రాంతంలోని ఓ భవనం బాల్కనీ ఒక్కసారిగా విరిగిపడింది. ఆ శిథిలాలు ఓ కారుపై, అక్కడ నిల్చుకున్న మరికొందరు వ్యక్తులపై పడిపోయాయి. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.

బాల్కనీ కూలిపోయిన వెంటనే భారీ శబ్ధం వెలువడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల ప్రజలు బిగ్గరగా అరుస్తూ పరుగులు తీశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని మథుర అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, బృందావన్ ఎస్‌హెచ్‌ఓ విజయ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కనీలో ఓ జంట కోతులు గొడవ పడుతుండగా అది పడిపోయింది.
VIDEO | "The police were coincidentally present near the site of the incident. All people who were under the debris have been rescued and shifted to a local hospital. Around 11 people were injured, of them four are critical," says Mathura SSP Shailesh Kumar Pandey. pic.twitter.com/41uk2V22IQ
— Press Trust of India (@PTI_News) August 15, 2023
సంఘటన గురించి మధుర ఎస్‌ఎస్‌పి శైలేష్ కుమార్ పాండే మాట్లాడుతూ.. "సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో పోలీసులు యాదృచ్ఛికంగా ఉన్నారు. శిథిలాల కింద ఉన్న వారందరినీ వెంటనే రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. 11 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు మరణించినట్లు ధృవీకరించారు.












Click it and Unblock the Notifications