యోగి ఎఫెక్ట్: రేప్ ఆరోపణల మాజీ మంత్రికి బెయిల్ ఇచ్చిన జడ్జీ సస్పెండ్
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి సస్పెండ్ అయ్యారు.
లక్నో: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి సస్పెండ్ అయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన లక్నో కోర్టు జడ్జీని అలహాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది.
ఓ మహిళపై అత్యాచారం, ఆమె మైనర్ కూతురుపై అత్యాచార యత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 49ఏళ్ల ప్రజాపతికి ఇటీవల లక్నోలోని పీఓసీఎస్‌ఓ కోర్టు ప్రత్యేక జడ్జీ ఓంప్రకాశ్ మిశ్రా బెయిల్ మంజూరు చేశారు. అయితే, దీనిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.

దీంతో హైకోర్టు న్యాయమూర్తి సదరు జడ్జిని సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించారు. చాలా రోజులు తప్పించుకుని తిరిగిన ప్రజాపతిని మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన దేశం విడిచి వెళ్లకుండా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు.. లక్నో బెంచ్ ప్రజాపతికి మంజూరైన బెయిల్ ను రద్దు చేసింది. ప్రజాపతి మంత్రి ఉన్న సమయంలో ఆయనతోపాటు మరో ఆరుగురు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధిత మహిళ గత ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరారీలో ఉన్న ప్రజాపతి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 15న పోలీసులు ప్రజాపతిని అరెస్ట్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications