మరో 2 పథకాలను ఆమోదించిన మంత్రివర్గం: ఏటా 5% ఇంక్రిమెంట్
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బీహార్. నవంబర్/డిసెంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది.
ఇందులో భాగంగా తాజాగా రెండు సంక్షేమ పథకాలను ఆమోదించింది. అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఆగ్జిలియరీ నర్సు మిడ్‌వైఫ్ (ఏఎన్‌ఎం) కార్యకర్తల గౌరవ వేతనాన్ని నెలకు 11,500 నుంచి 15,000 రూపాయలకు పెంచింది. ఈ మేరకే కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 9, 10 తరగతుల విద్యార్థుల వార్షిక స్కాలర్‌షిప్‌ను కూడా 3,600కు రెట్టింపు చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 129 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

ఇందులో ఒక సినిమా అండ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కూడా ఉంది. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గ అదనపు ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చౌదరి మాట్లాడారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను బలోపేతం చేయడానికి అర్బన్ ఏఎన్‌ఎం కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.11,500 నుంచి రూ.15,000కు పెంచినట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఏటా అయిదు శాతం ఇంక్రిమెంట్ ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి బాలక్/బాలికా స్కాలర్‌షిప్ పథకం కింద 9, 10 తరగతుల విద్యార్థుల వార్షిక స్కాలర్‌షిప్‌ను రూ. 1,800 నుంచి రూ. 3,600కు పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంపుదల వల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ. 99.21 కోట్ల అదనపు భారం పడుతుందని చౌదరి వివరించారు. రాష్ట్రంలో థియేటర్, సినిమా విద్యలో సంస్థాగత శిక్షణ లోపాన్ని పూడ్చడానికి బీహార్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
పర్యాటక మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి, పాట్నాలోని బాంకిపూర్ బస్ స్టాండ్ వద్ద 3.24 ఎకరాల స్థలంలో 5- స్టార్ హోటల్‌ను నిర్మించడానికి అనుమతి లభించింది. దీనికి సంబంధించి, కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థకు 'లెటర్ ఆఫ్ అవార్డు' జారీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ తరహాలో గయాలోని విష్ణుపాద ఆలయ ప్రాంత సమగ్ర అభివృద్ధికి అహ్మదాబాద్‌కు చెందిన ఒక సంస్థను ప్రధాన సలహాదారుగా నియమించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications