షాక్: మోడీ ప్రకటన తర్వాత 1,39,667నోట్ల నకిలీ కరెన్సీ బ్యాంకుల్లో జమ
పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నవంబర్ 10 నుంచి 27 వరకు అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం 1,39,667 నకిలీ నోట్లు జమ అయ్యాయని తేలింది.
న్యూఢిల్లీ: నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పెద్ద నోట్లను డిసెంబర్ 31 వరకు బ్యాంకులలో జమ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించడం జరిగింది.
ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను కొందరు అక్రమార్కులు బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిసింది.
నవంబర్ 10 నుంచి 27 వరకు అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం 1,39,667 నకిలీ నోట్లు జమ అయ్యాయని తేలింది. పెద్ద రద్దు తర్వాత రెండ్రోజుల నుంచి పాత రూ. 500, 1000 నోట్లను ప్రజలు బ్యాంకుల్లో మార్చుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పలువురు నకిలీ నోట్లను బ్యాంకులో ఇచ్చి.. చెలామణిలో ఉన్న నోట్లను పొందడం జరిగింది.

బ్యాంకుల్లో జమ అయిన మొత్తంలో 1,39,667 నకిలీ నోట్లను ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది భారత రిజర్వు బ్యాంక్ ధృవీకరించింది. ఈ మొత్తంలో ఆర్బీఐ సమాచారం ప్రకారం.. 86,621 రూ. 500 నోట్లు, 53,046 రూ. 1000 నోట్లు ఉన్నాయి.
కాగా, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చే వేల కోట్ల నకిలీ నోట్లకు అడ్డుకట్టపడింది. అలాగే అక్రమార్కుల వద్ద ఉన్న భారీ మొత్తంలోని పెద్ద నోట్లు కూడా చిత్తుకాగితాలుగా మారిపోయాయి.












Click it and Unblock the Notifications