Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పదవిలో ఉన్నా,లేకపోయినా... నా స్టాండ్ అదే... నవజోత్ సింగ్ సిద్దూ కీలక వ్యాఖ్యలు...

పంజాబ్ కాంగ్రెస్‌లో నవజోత్ సింగ్ సిద్దూ రేపిన దుమారం ముగిసింది.సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ తర్వాత ఆయన మెత్తబడ్డారు. తిరిగి పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగేందుకు అంగీకరించారు.తాజాగా సిద్దూ ట్విట్టర్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవిలో ఉన్నా లేకపోయినా రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ వాద్రాల వైపే ఉంటానని తేల్చి చెప్పారు. ఎన్ని ప్రతికూల శక్తులు ఏకమై తనను ఓడించేందుకు ప్రయత్నించినా.. శక్తినంతా కూడదీసుకుని పంజాబ్‌ను,పంజాబ్ ప్రజలను గెలిపించేందుకే తాను ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

'గాంధీజీ,శాస్త్రీజీ చెప్పిన సిద్దాంతాలను పాటిస్తాను. పదవిలో ఉన్నా లేకపోయినా నేను రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీల వైపే నిలబడుతాను.ప్రతికూల శక్తులన్నీ ఏకమైనా నా ఓటమికి ప్రయత్నించినా... శక్తినంతా కూడదీసుకుని పంజాబ్‌ను గెలిపిస్తాను... ప్రతీ పంజాబ్ పౌరుడు గెలిచేలా చేస్తాను...' అని సిద్దూ ప్రకటించారు. సిద్దూ చేసిన ఈ ప్రకటనతో ఇక ఆయన వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండం తప్పినట్లయింది.

post or no post i stand by rahul gandhi and priyanka says navjot singh sidhu

కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం... కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ పదవీ బాధ్యతలు చేపట్టడం... ఆ వెంటనే పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా ప్రకటించడం... ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. సిద్దూ రాజీనామాకు రకరకాల కారణాలు వినిపిస్తున్నా... సీఎం పదవి తనకు దక్కలేదన్న అసంతృప్తే అందుకు కారణమనే వాదన లేకపోలేదు.

సిద్దూ వర్గం,ఆయన సన్నిహితులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. తాను సూచించిన వ్యక్తులను కాదని... అవినీతి ఆరోపణలున్న రాణా గుర్జిత్ సింగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడమే సిద్దూ రాజీనామాకు కారణంగా చెబుతున్నారు.అలాగే రాష్ట్ర డీజీపీగా ఇక్బాల్ ప్రీత్ సింగ్ నియామకాన్ని కూడా సిద్దూ వ్యతిరేకిస్తున్నారని... అది కూడా రాజీనామాకు ఒక కారణమని చెబుతున్నారు.

సిద్దూ రాజీనామా కారణాలేమైనా సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆయనతో భేటీ అయ్యాక తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.రాజీనామాను ఉపసంహరించుకుని తిరిగి పదవిలో కొనసాగేందుకు అంగీకరించారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ కొనసాగుతారని ఆయన సలహాదారు మహ్మద్‌ ముస్తఫా జాతీయ మీడియాతో వెల్లడించారు. చర్చల్లో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని, సిద్దూ పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గుర్దీప్‌ ప్రకటించారు.

సిద్దూను ఓడించేందుకు పనిచేస్తా : అమరీందర్ సింగ్

తాను కాంగ్రె‌స్‌లో కొనసాగనని, అలాగని బీజేపీలోనూ చేరడం లేదని మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్దూ ఎక్కడ నుంచి పోటీచేసినా, ఆయన్ను ఓడించేందుకు పనిచేస్తానన్ననారు.ఇప్పటికైతే కాంగ్రెస్‌ పార్టీకి అమరీందర్‌ ఇంకా రాజీనామా చేయలేదు. అమరీందర్‌ సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చీల్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఇటీవలే అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ సమావేశమయ్యారు.దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+