MP Polls: కౌంటింగ్ కు ముందే తెరుచుకున్న బ్యాలెట్ బాక్స్-ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెలలో ముగిసింది. వచ్చే నెల 3న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగబోతోంది. అసలే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ తరుణంలో తాజాగా బాలాఘాట్ ప్రాంతంలో ఓ పోస్టల్ బ్యాలెట్ బాక్స్ తెరుచుకోవడం కలకలం రేపుతోంది. స్ధానిక ఎన్నికల అధికారులు ఈ బాక్స్ ను తెరవడంపై కాంగ్రెస్ మండిపడుతోంది.
డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో బాలాఘాట్‌లో అధికారులు పోస్టల్ బ్యాలెట్లను తెరిచారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కౌంటింగ్‌కు ముందు పోస్టల్ బ్యాలెట్లను తెరచిన వీడియో బయటపడిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఇప్పటికే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో సదరు బ్యాలెట్ ఓట్లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

ఇది చాలా తీవ్రమైన విషయమని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసుకోవాలని కమల్ నాథ్ కోరారు. ఈ వీడియోను ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ పోస్ట్ చేసింది. దీంతో అది బాగా వైరల్ అయింది. అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లో పోస్టల్ బ్యాలెట్లను సర్దుతున్నట్లు ఇందులో కనిపించింది. అలాగే అక్కడున్న కొందరు దీనిపై తమకు సమాచారం లేదని వాదించుకోవడం కూడా వినిపిస్తోంది.
कांग्रेस पार्टी ने बालाघाट जिले के कलेक्टर डॉ. गिरीश कुमार मिश्रा को तत्काल निलंबित करने एवं स्ट्रांग रूम से पोस्टल बैलेट निकालकर उसमें हेराफेरी करने की जाँच कराने हेतु चुनाव आयोग को ज्ञापन सौंपा।
— MP Congress (@INCMP) November 27, 2023
चुनाव आयोग को निर्वाचन की निष्पक्षता बरकरार रखने के लिये बालाघाट कलेक्टर के… pic.twitter.com/Au4RMrYWPv
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈసారి హోరాహోరీ పోరు సాగినట్లు ఎన్నికల సరళి బట్టి తెలుస్తోంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్ కు ఈసారి ఓటర్లు పట్టం కట్టబోతున్నట్లు ఒపీనియన్ పోల్స్ కూడా తేల్చేశాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లను ట్యాంపర్ చేసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications