వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో అద్వానీ: మోడీ టూర్‌కు ముందే.., బాధ్యత వీరిద్దరికే

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా మళ్లీ తెరపైకి భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ పేరు తెరపైకి వస్తుందా? అంటే కావొచ్చునని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా మళ్లీ తెరపైకి భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ పేరు తెరపైకి వస్తుందా? అంటే కావొచ్చునని అంటున్నారు.

మోడీ చూపు ఎవరి వైపు?: రాష్ట్రపతి రేసులో వెంకయ్య, సుష్మా సహా వీరే మోడీ చూపు ఎవరి వైపు?: రాష్ట్రపతి రేసులో వెంకయ్య, సుష్మా సహా వీరే

ఎన్టీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సందిగ్ధతకు త్వరలో తెరపడనుంది. ఎంతోమంది పేర్లను పరిశీలించిన బిజెపి అధిష్ఠానం చివరకు అద్వానీ వైపే మొగ్గు చూపింది.

అద్వానీని ఖరారు చేశారని..

అద్వానీని ఖరారు చేశారని..

ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం సోమవారం జరిగింది. అభ్యర్థిపై చర్చించారు. బిజెపి పార్లమెంటరీ భేటీలో మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, ఎస్సీ జమీర్ పేర్లను చర్చించారని తెలుస్తోంది.ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వానీ పేరును ప్రకటించే అవకాశముంది.

పోస్టర్లు

పోస్టర్లు

మరోవైపు, పార్టీ కార్యాలయానికి సమీపంలో అద్వానీని రాష్ట్రపతిగా ఎంపిక చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఇదిలా ఉండగా, అద్వానీ అయితే మద్దతిచ్చేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.

అభ్యర్థి ఖరారు..

అభ్యర్థి ఖరారు..

ప్రధాని నరేంద్ర మోడీ 24వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందే అభ్యర్థిని ప్రకటించాలని బిజెపి భావిస్తోంది. అభ్యర్థిత్వంపై మిత్రపక్షాలతో పాటు యూపీఏ పక్షాలతోను బిజెపి చర్చలు జరిపింది. వీటిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

వెంకయ్య ఇలా...

వెంకయ్య ఇలా...

ఈ నెల 23వ తేదీ కంటే ముందే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించనున్నట్లు ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు, విపక్ష నేతలతో మంతనాలు సాగిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం చెప్పారు. అయితే, ఈ రోజు బిజెపి పార్లమెంటరీ బోర్డులో చర్చించిన మీదట రేపు లేదా ఎల్లుండి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశముంది.

మోడీ, అమిత్ షాలకు అప్పగింత

మోడీ, అమిత్ షాలకు అప్పగింత

ఇదిలా ఉండగా, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు పార్టీ అప్పగించింది. వారు ఎవరిని సూచిస్తే వారిని అంగీకరిస్తామని పార్టీ నేతలు చెప్పారు.

English summary
Posters rooting for Advani as President don't stick for too long at BJP headquarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X