పేదరికమే కమలం టార్గెట్... నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల...
ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో మేనిఫెస్టోల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీలు తమ పథకాలతో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ సమీపిస్తున్న క్రమంలో బీజేపీ సోమవారం తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. కనీస ఆదాయ హామీ పథకం (న్యాయ్) కింద అత్యంత పేద కుటుంబాలకు ఏటా 72,000 రూపాయల నగదు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఏ అంశాలను చేర్చుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ మ్యానిఫెస్టో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్ధి, మహిళా సాధికారత, రామమందిర నిర్మాణం వంటి అంశాలపై దృష్టిసారించనుంది. ఇక నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో యువతకు ఉపాధి, నైపుణ్యాల కల్పనపైనా బీజేపీ మ్యానిఫెస్టో ఎలాంటి ప్రస్తావన తీసుకువస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పార్టీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు.

-
ఆ క్లెయిమ్ లపై రైతులకు కేంద్రం శుభవార్త.. వారికి షాక్! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications