Puneeth Rajkumar: నిన్న రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్ రాజ్ కుమార్, అక్కడ ఏం జరిగింది ?

బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు అంటే నమ్మడం చాలా కష్టం అని ఆయన సన్నిహితులు అంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ కు సమీపంలోని ఆసుపత్రిలో ప్రథమిక చికిత్స చేయించి అనంతరం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే పునీత్ రాజ్ కుమార్ మరణించారు. పునీత్ రాజ్ కుమార్ గురువారం రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు బర్త్ డే పార్టీకి హాజరైనారు. రాత్రి పొద్దుపోయే వరకు పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే పార్టీలో ఉన్నారు. అదే పార్టీలో శ్యాండిల్ వుడ్ ప్రముఖులు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణించిన ముందు రోజురాత్రి జరిగిన బర్త్ డే పార్టీలో ఏం జరిగింది అనే విషయాన్ని బర్త్ డే జరుపుకున్న సంగీత దర్శకుడు పిన్ టూ పిన్ వివరించారు.

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన పునీత్ రాజ్ కుమార్

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన పునీత్ రాజ్ కుమార్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు అంటే నమ్మడం చాలా కష్టం అని ఆయన సన్నిహితులు అంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ కు సమీపంలోని ఆసుపత్రిలో ప్రథమిక చికిత్స చేయించి అనంతరం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే పునీత్ రాజ్ కుమార్ మరణించారు.

సంగీత దర్శకుడు గురుకిరణ్ బర్త్ డే పార్టీ

సంగీత దర్శకుడు గురుకిరణ్ బర్త్ డే పార్టీ

శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురువారం రాత్రి బెంగళూరులో ప్రముఖ సంగీత దర్శకుడు గురుకిరణ్ బర్త్ డే పార్టీకి హాజరైనారు. రాత్రి పొద్దుపోయే వరకు పునీత్ రాజ్ కుమార్ గురుకిరణ్ బర్త్ డే పార్టీలో ఉన్నారు. అదే పార్టీలో దివంగత నటుడు, అలనాటి స్టార్ హీరో కన్నడ చంద్రముఖి ఫేమ్ విష్ణువర్దన్ అల్లుడు, నటుడు అనిరుధ్ తో పాటు శ్యాండిల్ వుడ్ ప్రముఖులు కొందరు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణించిన ముందు రోజురాత్రి జరిగిన బర్త్ డే పార్టీలో ఏం జరిగింది అనే విషయాన్ని బర్త్ డే జరుపుకున్న సంగీత దర్శకుడు గురుకిరణ్ శుక్రవారం మీడియా ముందు పిన్ టూ పిన్ వివరించారు.

అందరితో చాలా సంతోషంగా గడిపారు

అందరితో చాలా సంతోషంగా గడిపారు


తన బర్త్ డే పార్టీకి మీరు రావాలని చెప్పిన వెంటనే పునీత్ రాజ్ కు అంగీకరించారని గురుకిరణ్ అన్నారు. రాత్రి బర్త్ డే పార్టీకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారని, అక్కడ ఉన్న ప్రతిఒక్కరిని పేరుపేరునా పలకరించి అందరితో చాలా సంతోషంగా గడిపారని సంగీత దర్శకుడు గురుకిరణ్ అన్నారు.

రాత్రి రెండు గంటలు బర్త్ డే పార్టీలో ఉన్న పునీత్ రాజ్ కుమార్

రాత్రి రెండు గంటలు బర్త్ డే పార్టీలో ఉన్న పునీత్ రాజ్ కుమార్

చాలాకాలం ఇద్దరూ కలిసి పనిచేశామని, పాత విషయాలు, ఇక ముందు ఏం చెయ్యాలని అనుకుంటున్నాము అనే విషయాల గురించి పునీత్ రాజ్ కుమార్ తనతో చర్చించారని, సుమారు రెండు గంటలకు పైగా బర్త్ డే పార్టీలో ఉన్నారని సంగీత దర్వకుడు గురుకిరణ్ వివరించారు. శుక్రవారం పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు.

Recommended Video

    Puneeth Rajkumar: చిత్ర పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది.. దిగ్భ్రాంతి లో క్రీడాలోకం| Oneindia Telugu
    రాత్రి ఆరోగ్యంగానే ఉన్నారు

    రాత్రి ఆరోగ్యంగానే ఉన్నారు

    గురువారం రాత్రే పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు వచ్చిందని కొందరు చెప్పడం సరిగాలేదని, గురువారం రాత్రి ఆయన చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని, మాతో చాలా ఉత్సాహంగా గడిపారని సంగీత దర్శకుడు గురుకిరణ్ వివరించారు. మొత్తం మీద పునీత్ రాజ్ కుమార్ చివరి సారిగా సంగీత దర్శకుడు గురుకిరణ్ బర్త్ డే పార్టీలో పాల్గొని మరుసటి రోజు ప్రాణాలు వదిలేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+