మోడీ, జైట్లీపై పాల్ ప్రశంసలు: బడ్జెట్ బ్రీఫ్‌కేస్ మార్పు
లండన్/న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించే విధంగా ఉన్న బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు ప్రముఖ ప్రవాస పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత బడ్జెట్ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన సంకేతాలనిచ్చిందని తెలిపారు.
దేశం ఆర్థికంగా కోలుకునేందుకు ప్రధాని మోడీ, మంత్రి అరుణ్ జైట్లీలు ఈ బడ్జెట్ ద్వారా చక్కటి రోడ్ మ్యాప్ వేశారని ప్రశంసించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిదిగా ఈ బడ్జెట్ ఉందని అన్నారు. కెపరో గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ అయిన స్వరాజ్ పాల్, భారతదేశంలోని స్టీల్, ఆటో మోటివ్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టారు.

రంగుమారిన బ్రీఫ్‌కేస్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఆయన గురువారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తెచ్చిన బ్రీఫ్‌కేస్ రంగు మార్చి తీసుకొచ్చారు. ఈసారి ఆయన బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్‍లో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు.
బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎర్రటి బ్రీఫ్ కేసులను కేంద్ర ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రతులను తెచ్చేందుకు ఉపయోగించారు. అయితే ఆ సాంప్రదాయానికి ముగింపు పలుకుతూ అరుణ్ జైట్లీ బ్రౌన్ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ ప్రతులను పార్లమెంటుకు తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications