మాలేగావ్ పేలుళ్ల పై స్పెషల్ కోర్టు సీరియస్... సాధ్వీ కోర్టుకు హజరు కావాలని ఆదేశం.. !
2008లో జరిగిన మాలేగావ్ పేళుళ్ల కేసు కీలక దశకు చేరింది. కేసును విచారిస్తున్న ముంబయి ప్రత్యేక కోర్టు, పేళుళ్ల నిందితులను వారానికోసారి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారు కోర్టుకు రాకపోవడంపై కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఆసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలోనే విచారణ కోసం ప్రతివారం కోర్టు ముందు హజరు కావాలని ఆదేశించింది
కాగా మాలేగావ్ పేలుళ్ల కేసులో భోపాల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, ఇటివల ఎన్నికల ప్రచారంలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్న ప్రజ్ఝాసింగ్ ఠాకూర్ తోపాటు లెఫ్లినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లు నిందితులుగా ఉన్నారు. కాగా తీవ్రవాద కార్యకలాపాల్లో నిందితురాలుగా ఉన్న సాధ్వీకి బీజేపీ టికేట్ కేటాయించడంపై పలు విమర్శలు ఎదుర్కోంది.

2008లో సెప్టెంబర్ లో మోటార్ సైకిల్ ద్వార మహారాష్ట్ర్రలోని మాలేగావ్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఆరుగురు పౌరులు మృతిచెందగా మరో వందమంది వరకు గాయలపాలయ్యారు. దీంతో సాధ్వీతో పాటు ప్రసాద్ పురోహిత్‌ను పోలీసులు అదే సంవత్సరం అరెస్ట్ చేశారు. కాగా సాధ్వీ ఠాకూర్ ఏప్రిల్ 2017న కోర్టునుండి బెయిల్ పోందింది. తాజాగా ఆమే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది.












Click it and Unblock the Notifications