వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ భార్య ఎక్కడ?: విజయకాంత్‌తో మోడీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం జరిగిన ఎన్డీయే సమావేశంలో కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలను గుర్తు చేశారు.

మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో నేతల ప్రసంగాలు పూర్తి అయిన అనంతరం మోడీ కళ్లు డిఎండికె అధ్యక్షులు, నటుడు విజయకాంత్ కోసం వెతికాయి.

విజయకాంత్, ఆయన భార్య ఎక్కడ అని ప్రశ్నించారు. మోడీ అలా ప్రశ్నించగానే... ఎన్డీయే సమావేశంలో కూర్చున్న విజయకాంత్ నిలబడ్డారు. అనంతరం మీ సతీమణి ఎక్కడ అని మోడీ.. విజయకాంత్‌ను ప్రశ్నించారు. విజయకాంత్ తన భార్యను పిలిచాడు. ఆమె తన పనిని బాగా నిర్వర్తించాలని కితాబిచ్చారు.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

కాబోయే భారత ప్రధానిని తనను ప్రత్యేకంగా గుర్తించి పొగిడినందుకు విజయకాంత్ సతీమణి ప్రేమలత ఒకింత ఆశ్చర్యపోయారు. అనంతరం ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించారు. మోడీ తమను ప్రత్యేకంగా గుర్తించి పిలువడంతో ఆయన వద్దకు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత వెళ్లారు. విజయకాంత్ ఆయనతో చేతులు కలిపారు.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

తమిళనాడు బిజెపి విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె తదితర చిన్న చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసింది. పొత్తులో భాగంగా 14 స్థానాల్లో పోటీ చేసిన విజయకాంత్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. అయితే మోడీ మాత్రం విజయకాంత్‌ను ప్రత్యేకంగా గుర్తించారు.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

తమిళనాడులో ఎన్నికలు జరిగిన సమయంలో విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత రాష్ట్రంలోని 39 లోకసభ స్థానాల్లో విస్తృతంగా పర్యటించారు. దీనిని మోడీ ప్రత్యేకంగా గుర్తుంచుకున్నారు.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

తమిళనాడులో ఆయా పార్టీల తరఫున పలువురు మహిళా ప్రముఖులు జోరుగా ప్రచారం నిర్వహించారు. అయితే జయలలిత తర్వాత అనూహ్య స్పందన వచ్చింది ప్రేమలత, ఖుష్బూ వంటి వారికి మాత్రమే.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

డిఎండికె అధ్యక్షులు విజయకాంత్‌ను, ఆయన సతీమణి ప్రేమలతలను నరేంద్ర మోడీ ప్రత్యేకంగా గుర్తుంచుకొని మరీ ప్రశంసించడాన్ని టీవీల్లో చూసిన తమిళ బిజెపి నేతలు ఆనందం వ్యక్తం చేశారు.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

కాగా, విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలను పొగడ్తలలో ముంచెత్తిన నరేంద్ర మోడీ 2016 తమిళనాడు ఎన్నికల పైన దృష్టి సారించారని అంటున్నారు. 2016 తమిళనాడు ఎన్నికల్లో విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పాటు ఇతర పార్టీలతో కలిసి వెళ్లి మంచి ఫలితాలు సాధించి రాష్ట్ర అసెంబ్లీలోను ఎన్డీయే మిత్ర పక్షాలు కీలక పాత్ర పోషించాలని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె పార్టీ ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయింది. అదే ఎన్డీయే గెలుచుకుంది. ఇలాగే ముందుకు వెళ్లి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని తమిళనాడు ఎన్డీయే పక్షాలు, బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.

విజయకాంత్, మోడీ

విజయకాంత్, మోడీ

మరో విషయమేమంటే విజయకాంత్ సతీమణి ప్రేమలతను రాజ్యసభకు నామినేట్ చేసే యోచనలోను మోడీ ఉండి ఉంటారని అంటున్నారు. ప్రేమలతను రాజ్యసభకు నామినేట్ చేస్తే కనుక మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని తమిళ బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఇది తమ పార్టీకి కలిసి వస్తుందని అంటున్నారు. అయితే తమిళనాడులో జయలలిత పార్టీ 39 సీట్లకు గాను 37 సీట్లలో గెలుచుకున్నందున 2016లో తాము గెలిచేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారిస్తామని బిజెపి చెబుతోంది.

English summary
Soon after NDA leaders completed their speeches in Parliament’s Central Hall, Narendra Modi looked out for Vijayakanth. “Where is Vijayakanth and his wife?” the BJP mascot asked. As the actor-politician stood up from among the leaders, Modi asked: “Where is your wife?” Vijayakanth pointed to her in the audience and Modi gushed: “Kya kaam kiya isne (What a wonderful job she did).” By reaching out to the couple, Modi undid a small goof-up by Rajnath Singh, who had failed to invite any of the NDA’s Tamil Nadu leaders to felicitate the party mascot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X