వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక... 2014నాటికి 2,226 (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2014వ సంవత్సరంనాటికి భారత్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడు సంవత్సరాల క్రితం 1,400గా ఉన్న పులుల సంఖ్య 2014నాటికి 2,226కు పెరిగిందని కేంద్ర పర్యావరణ శాక పేర్కొంది. ప్రపంచంలోని 70 శాతం పులులు భారత్‌లోనే ఉన్నాయని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం ఓ నివేదికను విడుదల చేశారు.

2010 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,706 పులులు ఉండగా.. 2006 లో 1,411 పులులున్నట్టు ఈ నివేదికలో పేర్కొంది. దేశంలో ఉన్న పులుల సంఖ్యను అంచనా వేసే నివేదిక-2014 విడుదలపై పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో దేశంలో పులుల సంఖ్య పెరగటం శుభపరిణామని అన్నారు.

406 పులులతో కర్ణాటక అన్ని రాష్ట్రాలకన్నా ముందజలో ఉందన్నారు. ఆ తర్వాత వరుసగా ఉత్తరాఖండ్ లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్ లో 208, మహారాష్ట్రలో 190, పశ్చిమ బెంగాల్ లో 76 పులులు ఉన్నాయని తెలిపారు. 20వ శతాబ్ధం ప్రారంభంలో లక్షకు పైగా ఉన్న పులుల సంఖ్య వేటగాళ్లు వేటాడటంతో 2008లో 1411కు పడిపోయిందని చెప్పారు.

టైగర్ రిజర్వులను విజయవంతంగా నిర్వహించటంలో భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. ఆ తర్వాత నుంచి తీసుకున్న జాగ్రత్తల వల్ల పులుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చిందని అన్నారు.

భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక

భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక

2014వ సంవత్సరంనాటికి భారత్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడు సంవత్సరాల క్రితం 1,400గా ఉన్న పులుల సంఖ్య 2014నాటికి 2,226కు పెరిగిందని కేంద్ర పర్యావరణ శాక పేర్కొంది.

 భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక

భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక

2010 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,706 పులులు ఉండగా.. 2006 లో 1,411 పులులున్నట్టు ఈ నివేదికలో పేర్కొంది. దేశంలో ఉన్న పులుల సంఖ్యను అంచనా వేసే నివేదిక-2014 విడుదలపై పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో దేశంలో పులుల సంఖ్య పెరగటం శుభపరిణామని అన్నారు.

 భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక

భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక


406 పులులతో కర్ణాటక అన్ని రాష్ట్రాలకన్నా ముందజలో ఉందన్నారు. ఆ తర్వాత వరుసగా ఉత్తరాఖండ్ లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్ లో 208, మహారాష్ట్రలో 190, పశ్చిమ బెంగాల్ లో 76 పులులు ఉన్నాయని తెలిపారు.

 భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక

భారత్‌లో పులుల పరిస్ధితిపై నివేదిక

20వ శతాబ్ధం ప్రారంభంలో లక్షకు పైగా ఉన్న పులుల సంఖ్య వేటగాళ్లు వేటాడటంతో 2008లో 1411కు పడిపోయిందని చెప్పారు. టైగర్ రిజర్వులను విజయవంతంగా నిర్వహించటంలో భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు.

English summary
The Union Minister of State for Environment, Forest and Climate Change (Independent Charge) Prakash Javadekar addresses at the inaugural session of the meeting of Field Directors and Chief Wildlife Wardens on Best Practices and Wildlife Crime Monitoring Systems, organised by National Tiger Conservation Authority, in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X