వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం - హాజరైన ప్రధాని : రెండో సారి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

గోవా సీఎంగా ప్రమోద్ సావంత్​ ప్రమాణ స్వీకారం చేశారు. డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో గవర్నర్​ సమక్షంలో వరుసగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలో భాజపా పార్టీ 20 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది.

Recommended Video

Goa CM గా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన Dr Pramod Sawant | Oneindia Telugu

మహరాష్ట్రవాదీ గోమాన్‌తక్‌ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతుగా నిలిచారు. 2019లో మొదటిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. గోవాకు రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడవ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ చరిత్ర సృష్టించారు.

Pramod Sawants swearing-in was attended by Prime Minister Narendra Modi

2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రమోద్ సావంత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. 2019 మార్చిలో పారికర్ మరణం తర్వాత సావంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.సావంత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యునిగా పనిచేశారు. సావంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సంఘ్ వార్షిక సంచాలన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై సావంత్‌తో ప్రమాణం చేయించారు.

English summary
Pramod Sawant, who led the BJP to win 20 seats in the recently concluded elections was sworn in as the state's Chief Minister for the second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X