రేప్ వ్యాఖ్యలు: తపస్‌కు ప్రణబ్ తనయుడి వకాల్తా
హైదరాబాద్: అత్యాచార వ్యాఖ్యలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, బెంగాల్ నటుడు తపస్ పాల్‌ను క్షమించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ సూచించారు. తపస్ పాల్‌కు ఆయన అండగా నిలిచారు.
క్షమాపణ చెప్పినందున తపస్ పాల్‌ను వదిలేయాలని ఆయన అన్నారు. తపస్ ఇప్పటికే లేఖ ద్వారా పార్టీకి క్షమాపణ చెప్పారని, అప్పుడు పార్టీ ఆయనకు క్షమాభిక్ష పెడుతుందనుకుంటున్నానని చెప్పారు. పలుసార్లు నాలుక జారి కొన్ని మాటలు వస్తాయని, కానీఇలాంటి వ్యాఖ్యలు మాత్రం రాకూడనివని అభిజీత్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదని తాను ఆశిస్తున్నాని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే తమ కార్యకర్తలను సిపిఎంవారి ఇళ్లకు పంపించి వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానని తపస్ పాల్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో వెలుగు చూడడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
తపస్ పాల్ వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా సీరియస్‌గా తీసుకున్నారు.












Click it and Unblock the Notifications