తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!, రేపే పార్లమెంట్‌కు

Pranab Mukherjee
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం రాత్రి తెలంగాణ ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి మహారాష్ట్ర పర్యటనలో ఉండటంతో ఆయన వద్దకే కేంద్రం బిల్లును పంపించింది. అక్కడే ఆయన బిల్లును ఆమోదించారని సమాచారం. మరోవైపు రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారని, ఈ రోజు ప్రణబ్ సంతకం చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రేపు లేదా ఎల్లుండి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను రాష్ట్రపతికి పంపించింది. ఆయన నుంచి ఆమోదం వచ్చిన వెంటనే మంగళవారమే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ప్రణబ్ ఆదివారం రాత్రి ఆమోదం తెలిపినా లేక సోమవారం ఉదయం ఆమోద ముద్ర వేసినా ఇక పార్లమెంటులో పెట్టడమే మిగిలి ఉంది! అదే సమయంలో బిజెపిని దారికి తెచ్చుకోవడానికి పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలోనే రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటు ఆమోద ముద్రపడే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.

రాష్ట్ర విభజన బిల్లుకు శుక్రవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే, దానిని ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+