చిత్తు చిత్తుగా ఓడిపోయిన ప్రశాంత్ కిషోర్
రాజకీయ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా వెలువడిని ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ జన్ సూరాజ్ దారుణంగా ఓడిపోయింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ తాజాగా జరిగిన బీహార్ ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జన్ సూరాజ్ పార్టీ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో పోటీ చేశారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థులందరూ వారి వారి స్థానాల నుండి అత్యంత దారుణంగా ఓడిపోవడం జరిగింది.
ఇమామ్‌గంజ్, బెలగంజ్, రామ్‌గఢ్ మరియు తరారీ నియోజకవర్గాల నుంచి జితేంద్ర పాశ్వాన్, మహ్మద్ అమాజద్, సుశీల్ కుమార్ సింగ్ ,కిరణ్ సింగ్‌లను ప్రశాంత్ కిషోర్ తన పార్టీ తరుఫున ఎన్నికల బరిలో దించారు. అయితే వీరిలో ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు.అక్టోబరు 2న ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు, 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతానని చెప్పాడు. అయితే ఈలోపు నాలుగు ఉప అసెంబ్లీ స్థానికులకు ఎన్నికలు జరగడంతో, తన పార్టీ అభ్యర్థులను బరిలో దించారు.

నాలుగు బీహార్ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. రామ్‌గఢ్ మరియు తరారీ నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకోగా, బెలగంజ్ మరియు ఇమామ్‌గంజ్ వరుసగా JDU మరియు హిందుస్థానీ అవామ్ మోర్చా గెలుచుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి ప్రయత్నంలోనే బొక్క బోర్లా పడింది. పలు పార్టీలకు రాజకీయ వ్యూహాలు అందించి వారిని అధికారంలో కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్, తన పార్టీని ఒక్క స్థానంలో కూడా గెలిపించుకోలేకపోయారు. దీంతో బీహార్‌లో జన్ సూరాజ్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications