విషయం చెప్పింది: ప్రత్యూష చివరి ఫోన్ ప్రియుడికే
ముంబై: ముంబై: ఇరవై ఐదు రోజుల క్రితం 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. తాజాగా, ఆమె చివరి ఫోన్ కాల్‌కు సంబంధించి అంశాలు వెలుగు చూశాయి. ఇది మూడు నిమిషాల నిడివి ఉన్నట్లుగా తెలుస్తోంది.
సమాచారం మేరకు... జస్టిస్ మృదులా భత్కార్ మూడు నిమిషాల నిడవి గల ఆ ఆడియో రికార్డింగును వినున్నారని తెలుస్తోంది. ప్రత్యూష ఈ చివరి ఫోన్ కాల్ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు చేసింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె చేసిన చివరి ఫోన్ కాల్ ఇదే.
ప్రత్యూష తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ఫోన్ ద్వారా చెప్పిందని తెలుస్తోంది. చివరి ఫోన్ కాల్ రికార్డింగులో ఈ విషయం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ఆమె ఆత్మహత్యకు ముందు 135 ఎంజీ ఆల్కాహాల్ తీసుకుందని తుది మెడికల్ రిపోర్టులో ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది యావరేజ్ కంటే చాలా ఎక్కువ (ఆల్కాహాల్) తీసుకోవడమేనని చెబుతున్నారు. ఇంత మొత్తంలో ఆల్కాహాల్ తీసుకుంటే ఆ వ్యక్తి లేదా ఆ మహిళ తన ఆదీనంలో తాను ఉండరు.
ఆత్మహత్యకు ముందు ఆమె ఆల్కాహాల్ తీసుకున్నదని తెలిసినందున, అది కూడా పరిమితిని మించి తీసుకున్నదని తెలిసినందున... ఆత్మహత్య చేసుకునే సమయానికి ప్రత్యూష కూడా తన ఆదీనంలో తాను లేదని తెలుస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications