పనిలో పని.. ఢిల్లీ పేరు కూడా మార్చేయండి: కొత్త పేరు ఇదే: అమిత్ షాకు లేఖ

మొన్నటికి మొన్న కేరళ పేరును మార్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి పక్కన సున్నా చేర్చింది. కేరళ.. కేరళం అయింది. ఇదే ఊపులో ఏకంగా ఢిల్లీ పేరు మార్చాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. ఢిల్లీకి కొత్త పేరు కూడా సూచించారు భారతీయ జనతా పార్టీ లోక్ సభ సభ్యుడు ప్రవీణ్ ఖండేల్‌వాల్. ఇక్కడితో ఆగలేదాయన. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ సైతం రాశారు. రెండు పేజీల సుదీర్ఘ లేఖ ఇది.

ఢిల్లీకి ఆయన సూచించిన పేరు..

ఢిల్లీకి ఆయన సూచించిన పేరు.. ఇంద్రప్రస్థ. దేశ రాజధాని గుర్తింపు అనేది అత్యంత చారిత్రక, నాగరిక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఖండేల్‌వాల్ పేర్కొన్నారు. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటైన భారతదేశ రాజధాని పేరు దాని నిజమైన చారిత్రక మూలాలను, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించాలని ఖండేల్‌వాల్‌ అభిప్రాయపడ్డారు. చారిత్రక గ్రంథాలు, పురావస్తు ఆధారాలు, సుదీర్ఘ నాగరిక సంప్రదాయాల ప్రకారం, నేటి ఢిల్లీ నగరం పురాతన ఇంద్రప్రస్థ నగరానికి అనుగుణంగా ఉందని తెలిపారు.

Praveen Khandelwal Seeks Renaming Delhi as Indraprastha in Letter to Union Home Minister Amit Shah

మహాభారత ఇతిహాసంలో..

మహాభారత ఇతిహాసంలో వర్ణించినట్లుగా పాండవులు యమునా నది ఒడ్డున నిర్మించిన గొప్ప రాజధాని ఇంద్రప్రస్థ. దీని భౌగోళిక స్థానం ఆధునిక ఢిల్లీకి సరిగ్గా సరిపోలుతుందని వివరించారు. భారత్.. వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని కలిగిన కలిగి ఉన్న దేశమని, ప్రపంచంలోని ప్రఖ్యాత ప్రాచీన నాగరికత విలసిల్లిన గడ్డ అని పేర్కొన్నారు. అటువంటి దేశానికి రాజధాని పేరు దాని లోతైన చారిత్రక మూలాలను, నాగరిక గుర్తింపును ప్రతిబింబించేలా ఉండాలని అన్నారు.

ఢిల్లీ అనే పేరులో..

ఢిల్లీ అనే పేరులో ఎటువంటి ప్రాచీనత లేదని, అసలైన వారసత్వాన్ని తగ్గట్టుగా లేదని ఖండేల్‌వాల్ తేల్చి చెప్పారు. క్రీస్తు పూర్వం 1,000 నాటి ప్రాచీన నివాస పొరలతో పాటు, మహాభారత కాలానికి చెందిన 'పెయింటెడ్ గ్రే వేర్' మట్టి పాత్రలు ఢిల్లీలో బయటపడ్డాయని, ఈ నగరానికి చారిత్రక నేపథ్యం ఉందనడానికి సాక్ష్యం ఇదేనని చెప్పారు. నేటి ఢిల్లీ ఉన్న స్థలంలోనే పూర్వం ఇంద్రప్రస్థ నగరం వర్ధిల్లిందనే చారిత్రక నమ్మకానికి ఈ పరిశోధనలు బలమైన పునాదిని వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ/దిల్లీ/దెహ్లీ అనే పదాలు..

దీనికి విరుద్ధంగా, 'ఢిల్లీ' అనే పేరు- మధ్యయుగ కాలపు ప్రస్తావనల నుండి వచ్చిందని గుర్తు చేశారు. ఢిల్లీ/దిల్లీ/దెహ్లీ అనే పదాలు మధ్యయుగ పాలక రాజవంశాలతో సంబంధం కలిగి ఉన్నాయని వివరించారు. ఢిల్లీ చరిత్రలో భాగమైనా, అది దేశ అతి ప్రాచీన గుర్తింపును లేదా నాగరిక మూలాన్ని సూచించట్లేదని ఖండేల్‌వాల్ స్పష్టం చేశారు. నగరపు దీర్ఘకాలిక వారసత్వం కంటే పరిమిత చారిత్రక కాలాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుందని చెప్పారు.

ఆధునిక భారతదేశ రాజధాని..

ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా పునరుద్ధరించడం ద్వారా ఆధునిక భారతదేశ రాజధానిని దాని ప్రాచీన నాగరిక పునాదులతో తిరిగి అనుసంధానం చేయవచ్చని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పీఠం మానవజాతి పురాతన సాంస్కృతిక సంప్రదాయాలలో ఒకదాని వారసత్వంపై నిలుస్తుందని సూచిస్తుంది. ఇంద్రప్రస్థ అనే పేరు రాజధాని పౌర జీవితంలో ఇప్పటికే లోతుగా పాతుకుపోయిందని, ఢిల్లీలో పలు సంస్థలు ఈ పేరుతో పనిచేయడం ప్రజలలో దీని పట్ల ఉన్న పరిచయాన్ని ప్రతిబింబిస్తుందని ఎంపీ ఖండేల్‌వాల్‌ ఉద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+