వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్:టూర్ కు వెళ్ళి, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోండి, ధరఖాస్తులిలా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్:గుజరాత్ కు చెందిన 'వినా ముల్యే అమూల్య సేవ' పేరుతో ఓ సంస్థ సరికొత్త ఆలోచనలతో ముందుకువచ్చింది. మధ్య వయస్సులో ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారికి కొత్త భాగస్వామిని అందించేందుకు ఉపక్రమించింది.

వివాహం చేసుకొని విడిపోయిన మధ్యవయస్కులకు గుజరాత్ కు చెందిన సంస్థ ఈ బంఫర్ అఫర్ ఇచ్చింది. కొత్త జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనేందుకు గాను చర్యలు తీసుకొంటుంది.

ఈ టూర్ కు కేవలం పది వేల రూపాయాలను చెల్లించాలి.అయితే ఈ టూర్ లోనే కొత్త జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోనే వీలును కల్పిస్తోంది ఆ సంస్థ.

ఈ మేరకు తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనే వీలు కల్పిస్తోంది. ఈ టూర్ లో తమకు అనుకూలంగా ఉండే జీవిత భాగస్వామి గురించి అవగాహన చేసుకొనే వీలుంటుంది.

జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఇలా

జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఇలా

గుజరాత్ కు చెందిన 'వినా ముల్యే అమూల్య సేవ' పేరుతో ఓ సంస్థ కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది. మధ్య వయస్సులో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడిపే వారికి కొత్త భాగస్వామిని ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పించింది.అంతే కాదు సిమ్లా పర్యటనకు కూడ సిద్దం చేసింది. ఈ మేరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆ సంస్థ కోరుతోంది. ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు.

పది వేలు చెల్లిస్తే చాలు

పది వేలు చెల్లిస్తే చాలు

ఈ సంస్థలో తమ పేరును నమోదు చేసుకోవడానికి పది వేల రూపాయాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంబించారు. పదివేలు చెల్లిస్తే గుజరాత్ తో పాటు బెంగుళూరు,హైద్రాబాద్ నగరాల నుండి తమ పేర్లను నమోదుచేసుకొంటున్నారని నిర్వాహకురాలు భారతీ రావల్ తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ టారిఫ్ లేవు.భర్త చనిపోయినవారు,భార్య చనిపోయిన వారు ఈ టూర్ కోసం పేరను నమోదుచేసుకోవచ్చు.

ఒత్తిడిని అధిగమించేందుకు ఇలా

ఒత్తిడిని అధిగమించేందుకు ఇలా

చిన్న వయస్సులోనే పలు కారణాలతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నవారు ఈ టూర్ కు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారికి ఈ పర్యటన కొంత ఉపశమనాన్ని కల్గించే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.పలు రకాలైన వారు తమ వద్ద పేర్లను నమోదుచేసుకొంటున్నారని ఆ సంస్థ ప్రకటించింది.

ఎన్ ఆర్ ఐ లు కూడ తమ పేర్లు నమోదు

ఎన్ ఆర్ ఐ లు కూడ తమ పేర్లు నమోదు

మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన గ్రాడ్యుయేట్లు అధికంగా ఈ సంస్థ వద్ద తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. అయితే ఇద్దరు ఎన్ ఆర్ ఐ లు కూడ పేర్లను నమోదు చేసుకొన్నారు. 85 ఏళ్ళ వ్యక్తి, 72 ఏళ్ళ మహిళ కూడ పేరును నమోదు చేసుకొందని ఆ సంస్థ తెలిపింది. ఈ టూర్ లో జీవిత భాగస్వామిని ఎంచుకొనే వీలుందని ఆ సంస్థ తెలిపింది.మానవత దృక్పథంలోనే తాము ఈ పనిచేస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది.

English summary
Generally Shimla and Kullu-Manali are hot honeymoon destinations for young couples. But an Ahmedabad-based organisation 'Vina Mulye Amulya Seva' (Priceless Service at Zero Cost) has arranged a 'pre-wedding' tour for middle-aged 'singles'. This tour will provide a platform to middle-aged singles to mingle with potential life partner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X