మహిళా ఖైదీ: డెలివరి కోసం 11 నెలలు బెయిల్
అహ్మదాబాద్: వరకట్నం వేదింపుల కేసులో శిక్ష పడిన మహిళ డెలివరీ కోసం గుజరాత్ హై కోర్టు మానవతాదృక్పధంతో స్పందించింది. ఆమెకు 11 నెలల పాటు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
భావనా ప్రజాపతి (30) అనే మహిళ ప్రసవించేందుకు కోర్టు ఈ వెసులుబాటు కల్పిస్తూ తీర్పు చెప్పింది. భావనా ప్రస్తుతం ఐదు నెలల గర్బవతి. ఆమె డెలివరి కోసం బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో అర్జీ సమర్పించింది.
హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ కె. సయిూద్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం అర్జీ విచారించి భావనా ప్రజాపతికి బెయిల్ మంజూరు చేశారు. రూ. 10 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు అయ్యింది.

2016 డిసెంబర్ 31వ తేదిన బిడ్డతో సహ కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం భావనాకు ఆదేశాలు జారీ చేసింది. భావనా జైలుకు తిరిగి వచ్చిన తరువాత ఆమె రెండేళ్ల కుమార్తె, నవజాత శిశివు ఉండేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయమూర్తులు జైలు అధికారులకు సూచించారు.
తప్పు ఏమిలేకపోయినా నా బిడ్డలు జైలు శిక్ష అనుభవించడం చాల బాధగా ఉందని భావనా విచారం వ్యక్తం చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చెయ్యడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. భావనా సోదరుడి భార్య జల్పా ప్రజాపతి ఆత్మహత్య చేసుకుంది.
జల్పాను వరకట్నం కోసం వేదించడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. జల్పా భర్త, భావనా కుటుంబ సభ్యులు అందరి మీదా కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో భావనాతో పాటు ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులకు సెషన్స్ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications