లేడీ టెక్కీ ఆత్మహత్యకు ఇవే అసలుకారణాలు

బెంగళూరు: కార్యాలయం కట్టడం మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు శోభా (30) ఆత్మహత్య కేసు దర్యాప్తులో పలు సాక్షాలు సేకరించామని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.

మండ్యకు చెందిన శోభా చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కష్టపడి విద్యాభ్యాసం చేసింది. తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన శోభా తల్లితో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటున్నది.

Preliminary inquiries revealed that Shobha was having a dispute with her relatives over property,

ఇక్కడి వైట్ ఫీల్డ్ లోని హార్యాన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శోభా కుటుంబ సమస్యలతో విసిగిపోయిందని ఆమె తల్లి చెప్పారని పోలీసు అధికారులు అన్నారు. మండ్యలో శోభా తండ్రి పేరు మీద ఆస్తులు ఉన్నాయి.

తండ్రి మరణించిన తరువాత ఇప్పటి వరకు శోభా కుటుంబ సభ్యులకు ఆ ఆస్తులు ఇవ్వలేదు. ఆస్తుల పంపకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి బంధువులతో శోభాకు వివాదం ఉందని, కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదే కారణంతో జీవితంపై విరక్తి చెందిన శోభా గురువారం ఆమె పని చేస్తున్న కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని, ప్రాథమిక విచారణలో ఆస్తుల గొడవ విషయం వెలుగు చూసింది పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+