"ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్"
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలు స్వాంతత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం అని భారత ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని తెలిపారు. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందన్నారు. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలంటూ ఆకాంక్షించారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ద్రౌపదీ ముర్ము తెలిపారు. ప్రస్తుతం భారత జీడీపీ 6.5 శాతంగా ఉందన్నారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత ప్రజలు ఎంతో సంతోషంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికి గర్వకారణం అని అన్నారు. దేశ విభజన సమయంలో భారత్ ఎంతో బాధ, శోకాన్ని అనుభవించిందని తెలిపారు. విధ్వంసంతో పాటు లక్షలమంది బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలించబడ్డారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టామని అన్నారు.
ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించింది. మన దేశ భవితను మనమే మార్చుకునే అవకాశం వచ్చింది. దేశ ప్రజలు సమర్థవంతంగా ప్రజాస్వామ్యాన్ని అలవాటు చేసుకున్నారు. మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మాత్రమే అన్నికంటే ముఖ్యమైనవి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దేశానికి నాలుగు స్తంభాలుగా ఉన్నాయి. ప్రతి మానవుడు సమానమే. అందరికీ సమానమైన గౌరవం లభించాలి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఎలాంటి వివక్ష ఉండకూడదు. అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.

దేశంలో పట్టణీకరణ గణనీయంగా పెరుగుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. నగరాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మెట్రో సేవలు విస్తరించాయన్నారు. అమృత్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు చేరుతోందన్నారు.












Click it and Unblock the Notifications