ప్రణబ్ ముఖర్జీ కర్ణాటక పర్యటన: హై అలర్ట్
బెంగళూరు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్న సందర్బంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంతో పాటు మైసూరు, బీదర్ లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరులో బస చెయ్యనున్నారు.
సోమవారం మద్యాహ్నం 2 గంటలకు ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక విమానంలో మైసూరు చేరుకుంటారు. తరువాత చాముండికొండ చేరుకుని అమ్మవారికి ప్రత్యక పూజలు చేస్తారు. అనంతరం 3.30 గంటలకు మైసూరు విశ్వవిధ్యాలయం శతమానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోంటారు.

సాయంత్రం ఐదు గంటలకు బెంగళూరులోని యలహంకలోని ఎయిర్ ఫోర్స్ కేంద్రం చేరుకుంటారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో విదాన సౌధలో ఎఫ్ కేసీసీఐ శతమానోత్సవ కార్యక్రమంలో పాల్గోంటారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు.
మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో బీదర్ బయలుదేరి వెలుతారు. సాయంత్రం 5 గంటలకు నిమ్హాన్స్ మ్యూజియం ప్రారంభిస్తారు. సాయంత్రం 6.35 గంటలకు ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ బయలుదేరి వెళుతారు.












Click it and Unblock the Notifications