ప్రణబ్ దేశానికి వెలకట్టలేని సంపద: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రణబ్ ముఖర్జీని దేశానికి వెలకట్టలేని సంపదగా ఆయన ఆభివర్ణించారు. రాష్ట్రపతి ప్రణబ్ ఈరోజు తన 81వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోడీ ట్విట్టర్ తన సందేశాన్ని పోస్టు చేశారు.

ప్రణబ్‌ను వివేకం, మేధస్సు సమపాళ్లు కలిగిన వ్యక్తిగా ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ గౌరవప్రదమైన నాయకుడని, ఆయన దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ సందర్భంగా 'ప్రెసిడెంటల్ రీట్రేట్స్' పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ప్రణబ్ ప్రసంగాల సంపుటి-3ను కూడా విడుదల చేశారు.
కాగా రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్ర ప్రసాద్ నవోదయ విద్యాలయ పాఠశాలలో 'ఉమాంగ్-2015' వేడుకలను ప్రణబ్ ప్రారంభించారు. ఈ పాఠశాలను సౌరశక్తితో నడిచే హరిత విద్యాలయంగా ప్రకటించారు.
దీంతో పాటు 'రాష్ట్రపతి భవన్‌లో జీవితం' పేరిట పిల్లల కోసం ప్రత్యేక విభాగాన్ని ఆవిష్కరించారు. ఏడు నుంచి 15 ఏళ్ల వయసున్న బాలల కోసం దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి గురించిన వివిధ అంశాలను సరళమైన భాషలో దీని ద్వారా చిన్నారులకు అందుబాటులో ఉంచారు.
ప్రణబ్ ముఖర్జీ జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 1935 డిసెంబర్ 11న ప్రణబ్ పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు.
Pranab Da has always been a respected leader, with friends & well-wishers across the political spectrum. @RashtrapatiBhvn
— Narendra Modi (@narendramodi) December 11, 2015 President Mukherjee's long years in public life make him an invaluable asset to our nation. His wisdom & intelligence have few parallels.
— Narendra Modi (@narendramodi) December 11, 2015 I convey my heartfelt wishes to our beloved President, Shri Pranab Mukherjee on his birthday. I pray for his long & healthy life.
— Narendra Modi (@narendramodi) December 11, 2015 











Click it and Unblock the Notifications