కోరమాండల్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ విచారం: హెల్ప్‌లైన్ నెంబర్లు

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీతోపాలు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి అంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థించారు.

'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

 President Murmu, PM Modi Express Grief Over Odisha Train Accident: Here Are The Helpline Numbers

రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో ప్రమాద ఘటనపై ఆరా తీశారు ప్రధాని మోడీ. అవసరమైన అన్ని చర్యలు వేగవంతంగా తీసుకోవాలని సూచించారు. మరోవైపు, కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ శుక్రవారం రాత్రే ప్రమాద స్థలికి బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వం తరపున బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50వేలు ప్రకటించారు.

బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి తీవ్రంగా బాధపడ్డాను. సహాయక చర్యలు విజయవంతం కావాలని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషాద వార్తతో బాధపడ్డాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కోరుతున్నాను' అని రాహుల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఈ ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన చాలా విషాదకరమన్నారు. శనివారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్టు తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి ప్రమీలా మాలిక్‌ను ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు.

రైల్వే శాఖతోపాటు పలు సీఎంవోలు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశాయి..

హెల్ప్‌లైన్ నంబర్లు:
బెంగాల్ ప్రభుత్వం అత్యవసర నియంత్రణ గదిని కూడా సక్రియం చేసింది, హెల్ప్‌లైన్ నంబర్‌లను ప్రకటించింది. 033- 22143526/ 22535185.
రైల్వే హెల్ప్‌లైన్‌లు:
033-26382217 (హౌరా) 8972073925 (ఖరగ్‌పూర్) 8249591559 (బాలాసోర్) 044- 25330952 (చెన్నై) ఒడిశా హెల్ప్‌లైన్ నంబర్ 06782-26228.

మరోవైపు, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో రైలు పట్టాలు తప్పిన కారణంగా ప్రభావితమైన సెక్షన్‌లో కొన్ని రైళ్లను మళ్లించగా, అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి.

కాగా, ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం 100కిపైగా మంది మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా స్టేషన్, తమిళనాడులోని చెన్నై మధ్య నడుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే కావడం గమనార్హం.

బహ్నాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది, ఆ తర్వాత ఐదు రైళ్లు రద్దు చేయబడ్డాయి. 5 రైళ్ల మార్గాన్ని దారి మళ్లించారు. ఈ రైలు ప్రమాదం తర్వాత రద్దు చేయబడిన రైళ్లలో పూరీ ఎక్స్‌ప్రెస్ 12837, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 12863, సంత్రాగచ్చి పూరి స్పెషల్ 02837, షాలిమార్ సంబల్‌పూర్ 20831, చెన్నై మెయిల్ 12839 ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+