సత్యసాయి యూనివర్శిటీకి రాస్ట్రపతి. నందిహిల్స్ లోకి నో ఎంట్రీ, గోపిచంద్ కు !

బెంగళూరు/చిక్కబళ్లాపురం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు కర్ణాటకలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా అయిన చిక్కబళ్లాపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిక్కబళ్లాపూర్ తాలూకాలోని ముద్దెనహళ్లిలోని శ్రీ సత్యసాయి యూనివర్శిటీని సందర్శించనున్నారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్బంగా చిక్కబళ్లాపురంలోని ప్రముఖ పర్యాటకేంద్రాల్లో ప్రజలను సంచరించడానికి పూర్తిగా నిషేధించారు.

కర్ణాటకలోనే ఎంతో ఫేమస్ అయిన నంది హిల్స్, స్కందగిరి కొండల్లో పర్యాటకులకు ఆక్షంలు విధించారు. నందిహిల్స్ లో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిత్యం వేలాది మంది పర్యాటకులు వచ్చి వెలుతుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్న సందర్బంగా భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా నంది హిల్స్, స్కందగిరి కొండల్లోకి ప్రొసీజర్ కోడ్ సీఆర్‌పీసీ సెక్షన్ 114(3) ప్రకారం ప్రజల ప్రవేశాన్ని నిషేధిస్తూ చిక్కబళ్లాపూర్ జిల్లా కలెక్టర్ పీఎన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.

Draupadi Murmu

ఢిల్లీ నుంచి ఐఏఎఫ్‌ఎంఐ-17 ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేవనహళ్లి సమీపంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 3.55 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముద్దెనహళ్లికి బయల్దేరి వెళ్తారు. సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొంటుంన్నారు.

క్రీడలువిభాగంలో పుల్లెల గోపీచంద్, ఆరోగ్య విభాగంలో డాక్టర్ ప్రతిమా మూర్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ అజయ్ కె. సూద్, విద్యా విభాగంలో ప్రొఫెసర్ విజయ్ శంకర్ శుక్లా, సంగీతం, ఆర్ట్స్ విభాగంలో డాక్టర్ ఆర్కే పద్మనాభ, సామాజిక సేవా విభాగంలో తులసీగౌడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిక్కబళ్లాపురంలో పర్యటిస్తున్న సందర్బంగా భద్రతా కారణాల దృష్ట్యా జూలై 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులను నంది హిల్స్, స్కందగిరి కొండలలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో చిక్కబళ్లాపూర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Draupadi Murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్బంగా కర్ణాటక డీజీపీ భధ్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 60 మంది ఎస్‌ఐలు, కేఎస్‌ఆర్‌పీకి చెందిన 3 స్క్వాడ్‌లు, ముగ్గురు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 28 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 700 మంది పోలీసులతో ముద్దేనహళ్లి పరిసర ప్రాంతాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+