వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ .. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడి

|
Google Oneindia TeluguNews

భారతదేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో విజయవంతంగా బైపాస్ సర్జరీ చేయించుకున్నారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం . ఇక ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు .

భారత రాష్ట్రపతి , దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో విజయవంతంగా బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన వైద్యుల బృందాన్ని అభినందిస్తున్నాను. రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి డైరెక్టర్ ఎయిమ్స్ తో మాట్లాడానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు .

 President Ram Nath Kovind’s bypass surgery conducted successfully: Rajnath Singh

ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు .

75 సంవత్సరాల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ఛాతీలో అసౌకర్యం ఉందని ఫిర్యాదు చేయడంతో గత శుక్రవారం ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. తరువాత ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ పలు పరీక్షల అనంతరం ఆయనకు ఈ రోజు బైపాస్ సర్జరీ చేయాలని వైద్య నిపుణులు సూచించారు. రాష్ట్రపతి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎయిమ్స్ వైద్య నిపుణుల సంరక్షణలో ఆయన ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం నేడు ఒక ప్రకటనలో తెలిపింది . ఇక ఈ రోజు బైపాస్ సర్జరీ ఎయిమ్స్ వైద్యుల బృందం నిర్వహించగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిర్వహించిన బైపాస్ సర్జరీ సక్సెస్ అయిందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

English summary
President Ram Nath Kovind on Tuesday underwent successful bypass surgery at the All India Institute of Medical Sciences (AIIMS) in Delhi, defence minister Rajnath Singh said. “The President of India, Shri Ramnath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi. I congratulate the team of Doctors for successful operation. Spoke to Director AIIMS to enquire about Rashtrapatiji’s health. Praying for his well-being and speedy recovery,” Singh tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X